జిల్లాలో సర్వే కు సంబందించి 270 రెవెన్యూ గ్రామాల్లో చేసే దిశగా చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రోన్ సర్వే, నోటిఫికేషన్, గ్రౌండ్ వ్యాలీడేషన్, మ్యుటేషన్, చుక్కల భూములు, 22- ఏ తదితర అంశాలపై క్షేత్ర రెవెన్యూ, సర్వే అధికారులకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవి లత తెలియజేశారు.

గురువారం రాష్ట్ర స్థాయి అధికారులు స్పెషల్ సి ఎస్ సాయి ప్రసాద్, పి ఆర్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, సి సి ఎల్ ఏ కార్యదర్శి బాబు ఏ, తదితరులు వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ట్యాక్స్, నాన్ ట్యాక్స్ వసూళ్లుపై , జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి జేసీ సిహెచ్. శ్రీధర్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో సర్వే కు సంబందించి 270 రెవెన్యూ గ్రామాల్లో చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వారం లక్ష్యంలో గ్రౌండ్ ట్రుథింగ్ 10,408 ఎకరాల్లో కి గాను 4,093 ఎకరాల్లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రౌండ్ వ్యాలిడేషన్ నాలుగు గ్రామాల్లో చేపట్టాల్సి ఉండగా ఒక చోట మాత్రమే పూర్తి చేశామని, మిగిలినవి ప్రగతిలో ఉన్నాయన్నారు. భూరికార్డ్లు శ్వచ్చికరణ కార్యక్రమంలో 270 గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్ ఓ ఆర్ కి సంబంధించి 28 గ్రామాల్లో 5 దశల్లో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. జిల్లాలో 162 బల్క్ మిల్క్ యూనిట్స్ కు 137 చోట్ల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఇంకా 25 చోట్ల స్థలాలు గుర్తించాల్సి ఉందన్నారు. కొవ్వూరు మండలం, పెరవలి లో అనువైన స్థలాలు గుర్తించి నివేదిక కోరగా కొవ్వూరు మండలం లో గుర్తించడం జరిగిందని తెలిపారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాలకు సంబంధించి తొలి, రెండవ దశలో చేపట్టవలసిన భవన నిర్మాణాలకు సంబందించిన భూముల సేకరణ కోసం తహశీల్దార్లు కు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నామన్నారు. అవసరమైతే సంబందించిన రికార్డులను కలెక్టరేట్ ద్వారా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోటి నిధులువిడుదల చెయ్యడం జరిగిందని, ఇప్పటి వరకు రు.47 లక్షల కు పైగా బిల్లులు అప్లోడ్ చేశామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *