-ఖాళీ పోస్టుల భర్తీకి తగు చర్యలు తీసుకోవాలి
-కలెక్టర్ డా.కె.మాధవిలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ప్రత్యేక దృష్టి సారించామని, ఇందుకోసం సమన్వయ శాఖల కు దిశా నిర్దేశనం చేశామని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లుతో రాష్ట్ర ఆరోగ్య, మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ మాధవీలత క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆరోగ్య, మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యు, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే ఎన్.సి.డి. సర్వే పూర్తి చేయాలని, 12 నుండి 14 సం.ల మధ్య వయసు గల వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. జననీ యోజన, ప్రధాన మంత్రి మాతృవందన యోజన పథకం, ప్రతి గర్భిణీ మహిళకు రక్తహీనత లేకుండా హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి అవసరమైన వైద్య పరంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి యోజనా పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే భర్తీ చేయాలని అన్నారు. కోవిడ్ నేపధ్యంలో మరింత అప్రమత్తం చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత మాట్లాడుతూ, జిల్లాలో సీజనల్ వ్యాధులపై ప్రభల కుండా పంచాయతీ రాజ్, మునిసిపల్ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. క్షేత్ర స్థాయి లో కూడా ప్రజల్లో అవగాహన కోసం వాలంటీర్ వ్యవస్థ ను వినియోగించు కొంటున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీని ప్రాధాన్యతను అనుసరించి పరిగణలోకి తీసుకుని భర్తీ చేస్తామన్నారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చెయ్యమని వైద్యాధికారులను ఆదేశించా మన్నారు. కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూనే, వేక్సినేషన్ అందచేసే చర్యలు కూడా తీసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.స్వర్ణలత, మాస్ మీడియా అధికారి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News