గోదావరి కి వరదలు, వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై డివిజన్ స్థాయి అధికారులతో సమావేశం .. ఆర్డీవో మల్లిబాబు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అధిక వర్షాలు, విపత్తు నివారణ శాఖ హెచ్చరికల మేరకు కొవ్వూరు డివిజన్ స్థాయి సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని రెవెన్యూ డివిజన్ అధికారి మల్లిబాబు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, విద్యుత్, పోలీస్, వ్యవసాయ అధికారులతో వరదల సమయంలో గోదావరీ బండ్స్ వద్ద బలహీనంగా ఉన్న ప్రాంతాలు, తీసుకోవలసిన ముందస్తు చర్యలపై రూపొందించిన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఎర్ర కాలువ కు సంబందించి సమావేశంలో అధికారులు చర్చించారు. అధిక వర్షాలు కురిసి, గోదావరికి వరదలు వచ్చే రివర్ బండ్ల ను గుర్తించాలన్నారు. ఇందుకోసం సమన్వయ శాఖలు క్షేత్ర స్థాయి పర్యటన బలహీనంగా ఉన్న వాటితో నివేదిక అందచేయాలని కోరారు. నందమూరి అక్విడేట్ పరిధిలో అత్యధికంగా వర్షాలు కురిసే, గోదావరికి వరదలు ఉదృతంగా ప్రవహిస్తే ఇబ్బంది కలగవచ్చు నని, అయితే ఆప్రాంతంలో పటిష్ట మైన చర్యలు తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు నని ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులు వెల్లడించారు . ఎఱ్ఱకాలువ వలన దేవరపల్లి, నల్లజర్ల, నిడదవోలు మండలాల్లో ఎఱ్ఱకాలువ ఉదృతి ఎక్కువగా ఉండే సందర్భంలో నిడదవోలు మండలం లోని 7 గ్రామాలు ముంపున బారిపడే అవకాసం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ బి. శ్రీనాథ్, ఏ. డి. వ్యవసాయ శాఖ, పి. చంద్ర శేఖర్, హెచ్ ఓ, ఉద్యాన వన శాఖ, సీ. హెచ్. శ్రీనివాస్, డి. ఈ, హెడ్ వర్క్స్, పి. ప్రదీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *