-అర్హులకు పథకాలు అమలు చేయడం లో ఖచ్చితత్వం, విధుల్లో జవాుదారీతనం ఉండాలి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు వారి గ్రామా ల్లో సుపరిపాలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక స్పందన హాల్లో కలెక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తో కలిసి సంక్షేమ కార్యదర్శుల, ఎడ్యుకేషన్ కార్యదర్శులకు సర్వీస్ క్రమబద్ధీకరణ చేసి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నిర్ణీత కాలంలోనే చేరువ చేయాలనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగుల నియామించడం చేసిందన్నారు. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి ఈ మేరకు జిల్లాలోని 331 మంది సంక్షేమ ఎడ్యుకేషన్ కార్యదర్శులకు సర్వీస్ క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు పూర్తిస్థాయి పే స్కేల్ ని అందించి వారిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను చేసిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఉద్యోగి సద్వినియోగం చేసుకొని వారి సేవలను ప్రజలకి అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కలెక్టర్ సూచించారు. రాజమహేంద్రవరం డివిజన్లో 199 మంది సంక్షేమ, ఎడ్యుకేషన్ కార్యదర్శులకు గాను 191 మంది, కొవ్వూరు డివిజన్లో 169 మందికి గాను 140 మంది సర్వీసు క్రమబద్ధీకరించి, పే స్కేల్స్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులకి సర్వీసు క్రమద్దికరించిన ధృవీకరణ పత్రాలను అందచేశాసారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఎస్ సి సంక్షేమ అధికారి ఎమ్ ఎస్ శోభా రాణి, బిసి జిల్లా సంక్షేమ అధికారి పి. సత్య రమేష్, పలువురు వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర్లో ఉన్నారు.
Prajavartha Online Telugu News