విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో పేద ప్రజల అభ్యున్నతికి నవరత్నాలు అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వం లో మాదిరి దళారులు,లంచాలు లేకుండా వలంటీర్ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పధకాలు అమలు జరుగుతున్నాయని ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకులను హారతులు పట్టి స్వాగతిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్,73వ సచివాలయ పరిధిలోని సత్యనారాయణ నగర్ ప్రాంతాల్లో ఇంటి ఇంటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వారికి వివరించారు. అదేవిధంగా పధకాల అమలులో వారికి ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారించాలని సూచించారు.అదేవిధంగా స్థానిక ప్రజలు చెత్త పన్ను తగ్గించాలని అడుగుతుంటే వెంటనే మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేసి చెత్త పన్ను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని,ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు వారి రాజకీయ మనుగడ కోసం డ్రామాలు ఆడుతూ షో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ వారు అసత్య ప్రచారాలు చేసిన ప్రజల మద్దతు తమకే ఉందని అందుకు నిదర్శనమే ప్రజలలో వస్తున్న ఈ స్పందన అని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వం లో భారీ మెజారిటీతో గెలుస్తామని,అవే టీడీపీకి చివరి ఎన్నికలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు,కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, వైస్సార్సీపీ నాయకులు గుమ్మడి విజయ కుమార్,ముక్కు వెంకటేశ్వర రెడ్డి,వేముల కొండ,బచ్చు మాదవి,సుభాషిణి,రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News