కలెక్టర్ డా కె. మాధవీలత గోదావరి వరదలు పై ప్రజలకు సూచనలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పై ప్రాంతాల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున రావడం తో గోదావరి నది ప్రవాహం క్రమం క్రమంగా పెరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం  నాటికి ఈ ప్రవాహం స్థాయి 18 లక్షల క్యూసక్కుల కు పెరగవచ్చునని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను తప్పకుండ పాటించాలన్నారు. గోదావరి నది లోకి చేరుతున్న వరద నీరు ను చూడడానికి యువత పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతూ గోదావరి బ్రిడ్జి, గోదావరి గట్టు ప్రాంతాలకు చేరుకుంటున్నారని , ఇది ఇబ్బందులు కలుగు చేస్తుందని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతూ కుర్రవాళ్ళు అందరు ఫోటోలు సెల్ఫీలు తీసుకోడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారనీ, ఇది ప్రమాదానికి దారి తీస్తుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ రిస్కు తీసుకోవద్దు, ప్రాణనానికి ప్రమాదం అని కలెక్టర్ పేర్కొన్నారు. గోదావరి వంతెన పైనే కాదు గట్లు మీదే కాదు , అలా ఎక్కడికక్కడ వాహనాలు ఆపి కనపడితే అటువంటి వాటిపై చర్యక్యు తీసుకుంటామని , ప్రజలు పూర్తిగా అప్రమతంగా వుండాలన్నారు. ఇప్పటికే రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *