నైపుణ్యాని పెంచుకుని మెరుగైన ఉపాధి అవకాశాలను పెంచుకోవడం సాధ్యం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఐ టి ఐ లలో చేరి విద్యార్థులు వారిలోని నైపుణ్యాని పెంచుకుని మెరుగైన ఉపాధి అవకాశాలను పెంచుకోవడం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. బుధవారం జేసీ ఛాంబర్ లో ఐ టి ఐ లో వివిధ వృత్తి విద్యా కోర్సులకు ఎంపికైన అభ్యర్థులకు ఆడ్మిషన్ పత్రాలు ప్రిన్సిపల్ బివి రమణ రావు, జాయింట్ కలెక్టర్ లు అందజేశారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా నూతనంగా ఏర్పాటు చేసిన తరువాత జిల్లా పరిధిలో 13 ప్రభుత్వ ఐ టీ ఐ వృత్తి విద్యా సంస్థలు ఉన్నాయన్నారు. వీటిలో వివిధ కోర్సుల లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ లో చేరడం కోసం వచ్చిన ఆన్లైన్ ధరఖాస్తుల్లో ఈరోజు ఇంటర్వ్యూ లకి 196 మందిని పిలవడం జరిగిందన్నారు. ఈరోజు ఇంటర్వ్యు లకు 57 మంది హాజరు కాగా 46 మంది చేరడం జరిగిందని శ్రీధర్ తెలిపారు. మిగిలిన వారు కాకినాడ, కోనసీమ జిల్లా పరిధిలో ఐ టీ ఐ కోర్సుల లో ప్రవేశం కోసం ధరఖస్తూ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దశల వారీగా జిల్లాలోని అన్ని ఐ టీ ఐ లకు రాజమహేంద్రవరం కేంద్రంగా ఇంటర్వ్యూ లను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *