కృష్ణునిపాలెం సచివాలయాన్ని జేసీ ఆకస్మిక తనిఖీ

గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులకు పథకాలు అందించడం లోనూ, పౌర సేవలు అందించడంలో సచివాలయ సిబ్బంది అంకిత భావంతో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం గొకవరం మండలం కృష్ణునిపాలెం సచివాలయాన్ని జెసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ , సచివాలయం లో పనిచేసే సిబ్బంది సర్వీస్ క్రమబద్దకరణ చేసి వారి కుటుంబాలకు భరోసా ను ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా కార్యదర్శులు ప్రతిరోజు ఉదయం పనిచేసిన తరువాత మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు తమ సచివాలయ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని నమోదు చేసి ఆన్లైన్లో వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల నివారణ కోసం ముందుగా స్పందించే వ్యక్తి సచివాలయం సిబ్బంది ఉండాలని తెలిపారు. ప్రజల వద్దకు వాలంటీర్ వెళ్ళినప్పుడు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయలన్నారు. సచివాలయాల పరిధిలోనే పౌర సేవలను అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సచివాలయం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన ప్రజలకు చేర్చేలాగా పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. ఒక చక్కటి లక్ష్యంతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిందని తెలిపారు. సచివాలయ రికార్డులు, సేవల పరిష్కారం కోసం చేస్తున్న ప్రక్రియ, సిబ్బంది హజరు ను తనిఖీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *