ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మధురపూడి విమానాశ్రయం వద్ద ఏర్పాట్ల ను పరిశీలించిన హోం మంత్రి, జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ, రాజమండ్రి ఎంపి మర్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఇతర ప్రజా ప్రతినిధులు గోదావరి నదికి వరద నీరు భారీ ఎత్తున చేరడంతో తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కోనసీమ తదితరు జిల్లాలు జరిగిన ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ను పురస్కరించుకుని మధురపూడి విమానాశ్రయం నందు ముందస్తు భద్రత ఏర్పాట్లు హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ కె. మాధవి లత, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ పరిశీలించారు.

విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకుని స్వల్ప విరామం తర్వాత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టనున్న దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లపై విమానాశ్రయం అధికారులతో కలెక్టర్ సమీక్ష చెయ్యడం జరిగింది. అనంతరం భద్రత ఏర్పాట్లు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంలో రాజమండ్రి ఎంపి మర్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, తదితరులు ఉన్నారు.

ఎస్పితో కలిసి గోదావరి గట్లును పరిశీలించిన కలెక్టర్
గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ధవలేశ్వరం బ్యారేజ్ ద్వారా దిగువకు ప్రాంతానికి వరద నీటిని విడుదల చేసే క్రమంలో బండ్ల పరిస్థితి ని జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఆర్ ఎం సి సూపరింటెండెంట్ ఇంజినీర్ సాంబశివరావు తో పరిశీలించారు. సుబ్బాయమ్మ ఘాట్ ప్రాంతంలో గట్టు ను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలు పై వివరాలు తెలుసుకుని, రక్షణ చర్యలుపై ఆదేశాలు జారీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *