Breaking News

ముంపుకు గురి అయ్యే గ్రామాల్లో హోం మంత్రి పర్యటన

-అడుగడుగు తిరుగుతూ ప్రజలకు భరోసా
-పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రూ.2 వేలు ఆర్థిక సహాయం కు సిఎం ఆదేశం
-మంత్రి తానేటి వనిత

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పై రాష్ట్రాలను నుంచి పెద్ద ఎత్తున వరద నీరు గోదావరి లోకి చేరడంతో రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాలో ముంపునకు గురి అయ్యే గ్రామాల్లో తక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.

గురువారం సీతానగరం మండలం బొబ్బిలిలంక గ్రామానికి చేరుకున్న అనంతరం అక్కడినుండి బోటు మార్గంలో ములకల్లంక గ్రామానికి చేరుకున్న హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా తదితరులు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, భద్రాచలం పోలవరం ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీకి ఈ సాయంత్రానికి చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిదులు, అధికారులతో సమీక్ష నిర్వహించారన్నారు. ఇప్పటికే 15 లక్షలు పైగా క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజ్ కు చేరిందన్నారు. ఈ సాయంత్రానికి 20 నుంచి 22 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. ముంపు గ్రామాలలో పర్యటించి అక్కడ ప్రజలకు భరోసా నివ్వడం, అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అయితే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలను పాటించి ముంపు నకు గురి అయ్యే గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివచ్చి సహకరించాలని మంత్రి కోరారు. పునరావాస కేంద్రాలలో భోజన సదుపాయం, దుప్పట్లు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు. పునరావాస శిబిరాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు వైద్య సిబ్బందిని నియమించామన్నారు. ముంపు గ్రామాలలోని గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, మానవతా దృక్పథంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. క్షేత్ర స్థాయి లో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితి ను ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు ఇస్తున్నట్లు తెలిపారు. మంత్రి తానేటి వనిత జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా మునకల్లంక గ్రామంలో ఇంటింటికి వెళ్లి వరద నీరు గ్రామంలోకి చేరకముందే ప్రజలందరూ పునరావస కేంద్రాలకు తరలిరావాలని కోరారు. అనంతరం గోదావరి గట్టు ప్రాంతంలో ఉన్న మునికూడలి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలను పునరావస కేంద్రాలకి రావలసిందిగా కోరారు. శాసన సభ్యులు జక్కంపూడి రాజా, కలెక్టర్ మాధవీలత తదితరులతో కలిసి జిల్లాలో ముంపు గురి అయ్యే ప్రాంతాలలో పర్యటించినట్లు తెలిపారు. అనంతరం హోం మంత్రి తానేటి వనిత రాజమండ్రి సీతానగరం ఆర్ అండ్ బి రహదారుల విస్తరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్టిఓ ఎస్ మల్లిబాబు, ఆర్ అండ్ బి డిఈ మధుసూధన రావు,డిపిఓ సత్యనారాయణ, తాసిల్దార్ ఎస్. సత్యనారాయణరాజు, ఎంపీడీవో కే. రమేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు, ఎంపీపీ గుర్రాల జోష్ణ, వైస్ ఎంపీపీ సత్యంమదన్ బాబు, సర్పంచ్ ఎం. రామచంద్రరావు, స్థానిక నాయకులు మల్లేన చౌదరి, డాక్టర్ బాబు, చలమల సుజి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *