-టోల్ ఫ్రీనెంబరు 1962 కు ఫోన్ చేస్తే చాలురైతు ముంగిటే సేవలు..
-జిల్లాలో ఇప్పటి వరకు 35 గ్రామాల్లో 158 పశువులకు అత్యవసర వైద్యసేవలు…
-జేడీ.. డా. ఎస్ టి జి సత్య గోవింద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలను రైతాంగం (పశుపోషకులు) సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టరు డా.ఎస్.టి.జి.సత్య గోవింద్ అన్నారు. బుధవారం స్థానిక పశుసంవర్థక శాఖ కార్యాలయంలోడా.వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలు అంశంపై జెడీ డా.సత్యగోవింద్ పాత్రికేయులతో మాట్లాడుతూ పశుపోషణపై ఆదారపడి జీవిస్తున్న రైతులకు (పశుపోషకులు) వైఎస్సార్ పశు ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.పశువులకు ప్రాణనష్టం లేకుండా ఈ సంచార వాహనం ద్వారా అత్యవసర సేవలను అందించడం జరుగుతుందన్నారు. పశు పోషకులకు అంబులెన్స్ సేవల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1962 కు ఫోన్ చేస్తే రైతు గుమ్మం వద్ద కు సంచార పశు ఆరోగ్య సేవ వాహనం వచ్చి పశువుల ప్రాణ నష్టం లేకుండా కాపాడతారని అన్నారు. తద్వారా రైతుల పై ఆర్థిక భారం కూడాతగ్గుతుందని పేర్కోన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి దశలో ఒక్కోక్కటి చొప్పున పశు సంచార హహనాలు వచ్చాయన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని 35 గ్రామాల్లో ఇప్పటి వరకు 158 కేసులకు అత్యవసర వైద్యసేవలు అందించామన్నారు. అదేవిధంగా జిల్లాలో 3800 వరకు వివిధ రకాల వ్యాధులతో బాదపడుతున్నపశులకు వైద్యసేవలను అందించగా 580 మంది రైతులు లబ్దిపొందారని చెప్పారు. డా.వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలు అందించే అంబులెన్స్ ఆయా నియోజకవర్గాల్లోని ప్రదానకేంద్రంలోనే రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. అవసరాన్నిబట్టి పశువును దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలీక్లినిక్‌కు తరలించి మెరుగైన వైద్యసేవలందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరుస్తారని తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ప్రస్తుతం ఈవైద్య సేవలు పగటి పూట అందిస్తున్నామని తెలిపారు. సెలవు రోజుల్లో కూడా పశువలకు వైద్యసేవలు అందించడం జరగుతుందన్నారు. ఈవాహనంలో ఒక పశువైద్యాధికారి, ల్యాబ్ టెక్నీషియన్ కం కాంపౌండర్ మరియు డ్రైవరు ఉంటారని తెలిపారు. ఈవాహనంలో ప్రధమ చికిత్స, వ్యాధి నిర్థారణ, వ్యాధినివారణ టీకాలు, నట్టల నివారణ మందులు, చిన్నతరహా శస్త్రచికిత్సలతో పాటు కృత్రిమ గర్భధారణ మొదలగు వైద్యసేవలను పశువులకు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రధాన కార్యాలయంలో టెలిమెడిషిన్ సేవా కార్యక్రమం అందుబాటులో ఉందని రైతులు తమ అవసరాలను బట్టి పోన్ చేసి సంప్రదిస్తే పశువైద్యాధికారులు వారికి తగు సలహాలు అందిస్తారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం దేశంలోనే ఎక్కడా లేదని రైతులు ఈఅవకాన్నిసద్వినియోగం చేసుకోవాలని జాయింట్ డైరెక్టరు సత్యగోవింద్ కోరారు. ఈ కార్యక్రమం లో రాజమహేంద్రవరం ఉప సంచాలకులు, డా.కె.సత్యనారాయణ, జి.వీ కె. సంస్థ ప్రతినిధి కె. మోహన్ గాంధీ, ప్రోగ్రాం మేనేజర్, జి. శ్రీని వాస్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News