ఇన్ కమ్ రిటర్న్స్ దాఖలు చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విజ్ఞప్తి

-జనవరి 22 నెల ఐ టి చెల్లింపులు డి టి ఎ టాన్ లో చూపడం జరిగింది
-డి టి ఎ ఓ.. సత్యనారాయణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వ్యక్తిగతంగా దాఖలు పరిచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 2022 నెలకు సంబంధించి చెల్లించిన ట్యాక్స్ వివరాలు HYDD00408C టాన్ నుండి పొంద వచ్చునని తూర్పు గోదావరి జిల్లా ఖజానా మరియు ఖాతాల అధికారి ఎన్. సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జనవరి 2022 నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఖజనా మరియు అకౌంట్స్ సంచాలకులు ద్వారా నేరుగా జనవరి 2022 జీతాలు చెల్లింపులు జరిపియున్నారు. ఆ నెలకు సంబందించిన ఉద్యోగులు నుంచి మినహాయించిన ఇన్ కమ్ ట్యాక్స్ నెలవారీ స్థిర మినహాయింపు డైరెక్టర్ ఆఫ్ ట్రేజరీస్ అండ్ అకౌంట్స్, విజయవాడ వారి TAN నంబర్ HYDD00408C నుండి పొందగలరు. జనవరి నెలలో మినహాయించి ఉద్యోగుల ఇన్ కమ్ ట్యాక్స్ డ్రాయింగ్ అండ్ డిస్బర్శింగ్ (DDO) టాన్ లో చూపడం జరిగి ఉండనందున 26 AS నందు ఇన్ కమ్ ట్యాక్స్ డి డి వో ద్వారా తగ్గించినట్లు చూపడం జరగలేదు. జనవరి నెల ట్యాక్స్ మొత్తం డిటిఏ వారి 26 AS లోనే చూపించడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై 31 లోగా ఫైల్ చేసే వ్యక్తిగత ఐ టి రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఏప్రిల్ 21 నుంచి మార్చి 22 వరకు (జనవరి 22 తప్ప) సంబంధించిన డీడీఓ టాన్ నుంచి జనవరి 22 డైరెక్టర్ ఆఫ్ ట్రేజరీస్ టాన్ నుంచి ఉద్యోగులు అడ్వాన్స్ గా చెల్లింపు చేసిన ఇన్ కమ్ ట్యాక్స్ వివరాలు పొందవొచ్చునని డి టి ఓ సత్యనారాయణ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *