నగరంలో రహదారుల మరమ్మత్తులపై ఫోటో ప్రదర్శన

-ఈరోజు నుంచి 3 రోజులపాటు ప్రజల సందర్శార్థం
-ఎంపి భరత్ రామ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో జరిగే తరహా అభివృద్ధి స్థాయి లో మరెక్కడా నిర్ణయాత్మక మైన పనులు జరగటం లేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ అన్నారు.

శుక్రవారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో రహదారుల మరమ్మతు లపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ని రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి , కమిషనర్ దినేష్ కుమార్ తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి భరత్ రామ్ మాట్లాడుతూ, నగరంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న అన్ని డివైడర్ల ను గ్రైనెట్ తో ఆధునీక రించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు ఎండ్ టూ ఎండ్ విధానంలో రహదారుల పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా కూడా మట్టిరోడ్లు లేకుండా పనులు చేపట్టడం జరుగుతోందని, ఇందువల్ల గాలిలొ పొల్యూషన్ లేకుండా చూడగలం అన్నారు. పాట్ హోల్స్ లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇప్పటికే నగరంలో సుమారు 500 పాట్ హోల్స్ గుర్తించి మూసివేయడం జరిగిందని, కొత్తగా మరో 300 గుర్తించామని ఆయన తెలిపారు. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం తో పాటు డివైడర్ ఏర్పాటు, రోడ్లు వెడల్పు చెయ్యడం జరుగుతోందని పేర్కొన్నారు. హవెలా, 100 ఫీట్ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ రోడ్ ను 80 అడుగుల రహదారిగా జూనియర్ కాలేజ్ నుంచి ఐదు బండ్ల మార్కెట్ వరకు మునిసిపల్ కార్పొరేషన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం రైల్వేస్ కు రూ. 9.5 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నగరంలోని ప్రధాన రహదారులను అన్నింటినీ అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.

జూన్ 15 కల్లా రాష్ట్రంలోని అన్ని నగరాల్లో పాట్ హోల్స్ లేకుండా చూడాలనే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి ఆదేశాల మేరకు మన నగరంలో కూడా పనులు చేపట్టడం జరుగుతున్నట్లు మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. నగరంలో రూ.88 లక్షలతో 428 పాట్ హోల్స్ మరమ్మతులు చేశామని, వీటిని ప్రజలకు తెలియచేయడం కోసం ఫోటో ప్రదర్శన ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించామన్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎంపి మార్గని భరత్ వారి ఆధ్వర్యంలో రూ.11.36 కోట్లతో రహదారుల వెడల్పు చేసే పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రహదారుల లో పాట్ హోల్స్ కూడా గుర్తించి, యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తు లను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మంజూరు చేసినట్లు, అదనంగా మరో రూ.9.50 కోట్ల తో కొత్త రహదారుల నిర్మాణం పనులు చేపడుతున్నట్లు దినేష్ కుమార్ పేర్కొన్నారు. నగరంలో స్మార్ట్ రోడ్ ఉండాలని రూ.7 కోట్లతో జీ టి రోడ్డు ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎండ్ టూ ఎండ్ రోడ్ తో ఎయిర్ పోల్యుషన్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఇందుకోసం రూ. 15 కోట్లతో ప్రతిపాదన లను సిద్దం చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *