Breaking News

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదవ తరగతి ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్‌ కుమార్‌ ఆదేశించారు.
కలెక్టర్‌ట్‌ డిఆర్‌వో చాంబర్‌లో గురువారం ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపిఓఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించే పదవ తరగతి ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 520 మంది పదవ తరగతి 428 మంది ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలను వ్రాయనున్నారని అన్నారు. పదవ తరగతి పరీక్షలు ఆగస్టు 3వ తేది నుంచి 11వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3వ తేది నుంచి 11వ తేదీ వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని డిఆర్‌వో అన్నారు. పదవ తరగతి పరీక్షలు గాంధీమున్సిపల్‌ హైస్కూల్‌ వన్‌టౌన్‌ విజయవాడ నందు, ఎస్‌కెపివివి హైస్కూల్‌ కొత్తపేట విజయవాడ నందు ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలను ఎస్‌కెఆర్‌ యంఆర్‌మున్సిపల్‌ హైస్కూల్‌ సూర్యరావు పేట విజయవాడ నందు, ఎస్‌టివిఆర్‌ మున్సిపల్‌ దుర్గపురం విజయవాడ పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతాయని డిఆర్‌వో మోహన్‌కుమార్‌ అన్నారు. పరీక్షల నేపథ్యంలో కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులంతా మాస్క్‌లు ధరించేలా చూడాలని పరీక్ష హాల్లో శానిటైజేషన్‌ చేయాలన్నారు. పరీక్ష హాల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని విద్యుత్‌ కు ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఆర్‌టిసీ బస్సు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఎటువంటి జిరాక్స్‌ సెంటర్లు లేకుండా మూసివేయించాలన్నారు. పరీక్షల కోసం బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్‌వో మోహన్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపిఓఎస్‌ఎస్‌ జిల్లా కో`ఆర్డినేటర్‌ ఎన్‌. బాబు రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *