కాణీపాకం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె. రోజా మరియు సెల్వమణి దంపతులు కాణీపాకంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం నందు మహా కుంభాబిషేకం మహోత్సవంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి ఆర్కే రోజా దంపతులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారులు విశేష పూజలు నిర్వహించారు. మంత్రి రోజా సెల్వమణీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్బంగా ఆలయ పూజారులు వేదమంత్రాల మద్య వారిని ఆశీర్వదించారు.
Prajavartha Online Telugu News