వీఆర్వోలకు బయో మెట్రిక్ లో వెసులు బాటు కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వీఆర్వోలకు బయో మెట్రిక్ విధానం తొలగించి లేదా ఇదివరకులాగా అదర్స్ లో గ్రామ/వార్డు సచివాలయంలో బయో మెట్రిక్ వేసుకొనే వెసులు బాటు కల్పించవలసిందిగా రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు కోరారు. ఆదివారం విజయవాడ కె.డి.సి.సి. బ్యాంక్ ప్రధాన కార్యాలయం లో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు భూపతిరాజు రవీంద్ర రాజు, ఎం.అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ అజెండా అంశాలు తెలిపారు. ప్రమోషన్ G.0 154 ప్రకారము అన్నీ జిల్లాల లో వీఆర్వో  నుండి సీనియర్ సహాయకులుగా సుమారు 400 పొందుట మరియు అమెండ్మెంట్ G.O 64 సాధించుటకు చేసిన కృషి, కారుణ్య నియమకముల ఫైల్ ప్రస్తుత స్థితి, గ్రేడ్ -2 వీఆర్వో లకు సర్వే ట్రైనింగ్ తో సంభందం లేకుండా వెంటనే ప్రొహిబిషన్ డిక్లర్ చేసి పే స్కేలు అమలు చేసి వారికి వెంటనే బదిలీలకు అవకాశం కల్పించాలన్నారు. ప్రస్తుతం 26 జిల్లాలు ఏర్పాటు చేసినందున ఆఫీసులలో జూనియర్ సహాయకుల పోస్టులు అవసరము ఉన్నందున, సుముఖముగా ఉన్న వీఆర్వో లుతో జూనియర్ సహాయకుల పోస్టులు భర్తీ చేయుట గ్రామ/వార్డు సచివాలయములలో వీఆర్వో ల విధుల నిర్వహణకు లాప్ టాప్ సౌకర్యం కల్పించి గ్రామ/వార్డు సచివాలయంలో ముఖ్యమైన రికార్డు భద్రపరుచుటకు గాను బీరువా మరియు స్టేషనరీ ఇతర సదుపాయములు కల్పించాలన్నారు. కొత్తజిల్లాలు ప్రకారము ఇంకనూ పూర్తి చేయని జిల్లా కమిటీ నియమకాములు త్వరితగతిని పూర్తి చేసి, పార్ట్ టైమ్ వీఆర్వో లు గా పని చేసి, పదవి విరమణ చేసిన వారికి రైస్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలన్నారు. వీఆర్వోలు అందరికి సీపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. వీఆర్వో లు అనేక రకముల పని ఒత్తిడితో గురి అవుతున్నారు. కేవలం BEYOND SLA లో సర్టిఫికెట్స్ మరియు MUTATIONS FILES వస్తే కనీసం సంజయాసీ ఆడగకుండా కొంతమంది అధికారులు వీఆర్వో లను సస్పెండ్ చేయడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర కార్య వర్గ సభ్యులు, అన్నిజిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *