చిరంజీవి గొప్ప మానవతావాది… : పోతిన వెంకట మహేష్

-సామాన్యుడు స్వయంకృషితో మెగాస్టార్ అయ్యారు
-తమ్ముడికి అన్నయ్య అండగా నిలవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ , సడన్ సెంటర్ వద్ద గల 48వ డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ మరియు నగర కమిటీ సభ్యులు వేవిన నాగరాజు గార్ల ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొని కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ముందుగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని, చిరంజీవి  సామాన్యుడు నుంచి స్వయంకృషితో మెగాస్టార్ అయ్యారరుఅని, చిరంజీవి  గొప్ప మానవతవాదిఅని,మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక సినిమా నేపద్యమే కాకుండా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది కంటి చూపును పొందగా.. లక్షలాది మంది ఆపద సమయాల్లో ఉచితంగా రక్తాన్ని పొందారని, , ప్రజల్లో రక్తదానంపై ఉన్న అపోహల్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేసింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్అనీ, అందుకే ఈ బ్లడ్ బ్యాంకుకు ఇప్పుడు జాతీయ స్థాయి గౌరవం దక్కిందని.చిరంజీవి ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, కరోనా విపత్కర సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా డొనేషన్ వంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని ,రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలో రావడానికి తమ్ముడికి అండగా అన్నయ్య ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసిన జగదీష్, తమ్మిన రఘు, లింగం శివప్రసాద్, నాగరాజు, పిళ్ళ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *