-స్పందనలలో 30 అర్జీలను స్వీకరించిన
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందనలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. నగరపాలక సంస్థ ద్వారా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేటి స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్(జనరల్)– 1, పట్టణ ప్రణాళిక – 8, ఇంజనీరింగ్ – 1, పబ్లిక్ హెల్త్ విభాగం – 9, యు.సి.డి – 1, అకౌంట్స్ విభాగం – 7, రెవిన్యూ– 3, అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, ఎస్.ఇ నరశింహమూర్తి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, బయాలజీస్ట్ డా.బాబు శ్రీనివాసన్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 6 అర్జీలు
జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 1 పరిధిలో రెవిన్యూ – 2 అర్జీలు, పట్టణ ప్రణాళిక -1 అర్జీ, సర్కిల్ – 2 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక -1 అర్జీ మరియు సర్కిల్ –3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1, పబ్లిక్ హెల్త్ విభాగం – 1 అర్జీలలు మొత్తం 6 అర్జీలు వచ్చినవని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.
Prajavartha Online Telugu News