స్పందనలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నిర్వహించే స్పందనలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని విభాగాదిపతులను నగర నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కాలని ఆదేశించారు. సచివాలయాల్లో కూడా ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరగాలాని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సచివాలయాలలో అర్జీలు అందించాలని, అందిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే స్పందనలో వచ్చే అర్జీలను సమగ్ర సమాచారం, మరియు పరిష్కారాలతో నిర్షేశిత గడువులోగా క్లోజ్ చేయాలని, అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లను విభాగాధిపతులు పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని, నిర్దేశిత గడువులోగా ఫిర్యాదులు, అర్జీలు పరిష్కరించాల్సిన భాద్యత విభాగాధిపతిదేనని తెలిపారు.
సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమం నందు 43 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 17, ఇంజినీరింగ్ విభాగం 12, ప్రజారోగ్య విభాగం 4, రెవెన్యూ విభాగం 8, ఉపా సెల్ 2 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ బి.శ్రీనివాసరావు, యస్.ఈ. రామ్మోహన్ రావు, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మీ, బయాలజిస్ట్ మధుసూదన్, ఏ.సి.పి.లు, ఆర్.ఓ.లు, ఈ.ఈ లు, యస్.యస్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *