విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు,ప్రజలు మా దృష్టికి తెచ్చిన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇక్కడ ప్రజలు ఈ రోడ్డు పాడయి అవస్థలు పడుతున్న విషయం మా దృష్టికి తీసుకురాగా తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు సచివాలయనికి 20లక్షల రూపాయల కేటాయించిన నిధుల నుండి ఈ రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో అభివృద్ధి అనేది కేవలం శంకుస్థాపన లకే పరిమితం కానీ నేడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసిన ప్రతి పనిని వెనువెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా వైసీపీ నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారు అని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్, అబ్భినాయుడు, ముచ్చింతల వెంకటేశ్వరావు,మోహన్ రావు, రామారావు,రామకృష్ణ, హరీష్,సంపత్,డొక్కుల నాగేశ్వరరావు, పొనుగుపాటి శ్రీనివాస్,దాలి నాయుడు, హుస్సేన్, వడివేలు, వెంకటేష్,రాజా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News