స్వచ్చసర్వేక్షణ్ లో ప్రధమ స్థానం వచ్చుటకు కృషి చేయాలి…

-అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల మేరకు అన్ని సర్కిల్స్ లలో స్వచ్చసర్వేక్షణ్ మీద సమవేశములు ఏర్పాటు చేయడమైనది. శుక్రవారం జోనల్ కమిషనర్ కార్యాలయముల నందు శానిటరీ ఇన్స్పెక్టర్స్ మీటింగ్ జరిగినది. సదరు మీటింగ్ నందు అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల గారు హాజరై ఈ క్రింది విషయములు చర్చించినారు. యూసర్ ఫీ కలక్షన్ వారానికి 8 లక్షల టార్గెట్ డివిజన్ వైజ్, D&O ట్రేడ్స్ కలక్షన్, క్లాప్ వెహికాల్స్ (ఆటోస్) బరువును సక్రమంగా ఉపయోగించుకొని మొదటి ట్రిప్ 750 kgs, రెండొవ ట్రిప్ 500 kgs ఉండునట్లుగా సక్రమంగా ఉపయోగించుకొనుట, ప్లాస్టిక్ నిషేధం సక్రమంగా అమలు అయ్యే విధముగా చూచుట, స్వచ్చసర్వేక్షణ్ కంపోనేంట్స్-పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటి టాయిలెట్స్ రిపేర్లు చేయించుకొని మెరుగైన పద్దతులతో నిర్వహించుట, నివాస ప్రాంతములు, వాణిజ్య ప్రాంతముల యందు స్వచ్చసర్వేక్షణ్ నోర్మ్స్ ప్రకారం చూసుకొనుట, మూలాలు (సోర్స్) విభజన అమలు అయ్యే విధంగా చూచుట, ఫ్రీ పోట్ హోల్స్, No GVPS, No C&D వేస్ట్, No యూజీడి ఓవర్ ఫ్లో, No సాలిడ్ వేస్ట్ ఇన్ థ డ్రైన్స్, వాణిజ్య ప్రాంతముల యందు ట్విన్ బీన్స్ సరిపడ ఏర్పాటు చేయుట, బస్ స్టాప్ ల యందు ట్విన్ బీన్స్ ఏర్పాటు చేయుట దశల వారిగా బీన్స్ లు తొలగించుట 3R (Reduce, Reuse, Recycle) అమలు చేయుట, హోం కంపోస్టింగ్ చూచుట మొదలగు విషయముల మీద పూర్తి స్థాయిలో నిర్వహించి స్వచ్చసర్వేక్షణ్ లో ప్రధమ స్థానం వచ్చుటకు కృషి చేయవలసిందిగా కోరినారు. సమావేశములో జోనల్ కమిషనర్ -1 కె.టి. సుధాకర్, జోనల్ కమిషనర్ i/c డా. ఏ.రవిచంద్, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, డా.శ్రీదేవి, డా.ఇక్బాల్ హుస్సేన్ శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *