-పెండిరగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించి సహాయ నిధిని వెంటనే చెల్లించాలి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా విజిలెన్స్ అండ్ పర్యవేక్షణ కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధ్యక్షతన కొత్తగా ఎంపిక కాబడిన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు (డివియంసి), పోలీస్, న్యాయ, సాంఫీుక సంక్షేమ శాఖ అధికారులుతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ మాసం నుండి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 93 కేసులు నమోదు కాగా వీటిలో 91 కేసులకు సంబంధించి సహాయ నిధిగా 1 కోటి 3 లక్షల రూపాయలను అందించడం జరిగిందన్నారు. నమోదైన 93 కేసులలో విజయవాడ డివిజన్‌లో 68, నందిగామ డివిజన్‌లో 20, తిరువూరులో 5 కాగా, మిగిలినవి ఖమ్మం, గుంటూరు జిల్లాలకు చెందినవిగా ఉన్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు అయిన కేసులపై నిర్లక్ష్యం వహించరాదని సరైన విచారణ చేపట్టి పరిహారం చెల్లింపులు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం యాక్ట్ 95 ను అమలు చేయవలసిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. కేసులు ఎన్ని నమోదు అయ్యాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి, రాజీ అయిన కేసులు ఎన్ని, ఎంత మందికి శిక్ష పడిరదని అనే అంశాల మీద కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతీ మూడు నెలలకు ఒక సారి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు కుల దృవీకరణ పత్రాలు జాప్యం లేకుండా త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ కులాలు, తెగలకు సంబంధించిన డప్పు కళాకారులకు పెన్షన్ పొందేందుకు గుర్తింపు కార్డులను కూడా అందించాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్, సాంఫీుక సంక్షేమ శాఖ డిడి బివి విజయభారతి, డిఎస్సీపి యం. సత్తిబాబు ఆర్‌డివో ప్రసన్న లక్ష్మి, డ్వామా పిడి జె. సునీత, కమిటీ సభ్యులు ఉన్నారు.
Prajavartha Online Telugu News