విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారందరికీ నవరత్నాలతో తిరిగి లబ్ది చేకూర్చడం జరిగిదని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి ఆన్ లైన్ ద్వారా లబ్ది దారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం మనస్సున్న ప్రభుత్వమని అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతనైన లబ్ది అందని వారికి అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ప్రతీ ఆరు నెలలకు ఆడిట్ జరుగుతుందని ఆర్హులు ఎవరూ మిగిలిపోరాదని మానవతా దృక్ఫథంతో లబ్ది చేకూర్చడం జరుగుతుందన్నారు. కుల, మత, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా నీరుపేదలకు లబ్ది కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో సమావేశం అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు లబ్దిదారులకు నగదు చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలతో లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ చెప్పారు. వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారికి మరల ఆర్థిక సాయం మంజూరు చేయడం జరిగిందన్నారు. ద్వై వార్షిక నగదు మంజూరులో జిల్లాలో 21,597 లబ్దిదారులకు 33.44 కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు నేరుగా జమ చేశామన్నారు. ఏవైనా కారణాలతో పథకాలు అందని వారు స్థానికంగా సమీపంలోని సచివాలయాలలో సంప్రదించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
జిల్లాలో ద్వై వార్షిక నగదు బదిలీ పథకం, లబ్దిదారుల వివరాలు:
పథకం లబ్దిదారులు సంఖ్య జమ అయిన నగదు
జగనన్న అమ్మఒడి 1488 193.44 లక్షలు
జగనన్న చేదోడు 31 3.10 లక్షలు
జగనన్న వసతి దీవెన 663 56.414 లక్షలు
జగనన్న విద్యా దీవెన 7820 1407.00 లక్షలు
వైఎస్సార్ కాపు నేస్తం 1104 165.61 లక్షలు
వైఎస్సార్ నేతన నేస్తం 3 0.72 లక్షలు
వైఎస్సార్ చేయూత 1370 256.87 లక్షలు
వైఎస్సార్ వాహన మిత్ర 440 44.00 లక్షలు
వైఎస్సార్ ఈబీసీ నేస్తం 32 4.80 లక్షలు
వైఎస్సార్ మత్స్యకార భరోసా 8 0.80 లక్షలు
వైఎస్సార్ పెన్షన్ కానుక 7595 2.08 కోట్లు
డా. వైస్సార్ ఉచిత పంటల బీమా 1043 10.04 కోట్లు
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమలపూర్ణమ్మ, డిఆర్‌డిఏ పిడి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం విజయభారతి, బిసీ వెల్ఫేర్ డిడి లక్ష్మి దుర్గ, అర్భన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ శకుంతల, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News