Breaking News

సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించండి…

-జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వార్డు సచివాలయ సిబ్బంది వార్డు సచివాలయల వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువుగా వుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు సక్రమంగా అందే విధంగా పనిచేసి సచివాలయ వ్యవస్థను పటిష్ట పరచాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ అన్నారు.
నగరంలోని 4వ వార్డు గిరిపురం, బాడవపేట సచివాలయాలను, ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఉన్న 91,92 సచివాలయాలను శనివారం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ వార్డు సచివాలయ పరిధిలో ప్రజలనుండి వచ్చే ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియపరిచి ఆయా సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను సకాలంలో లబ్దిదారులకు అంధించే విధంగా సిబ్బంది ప్రజలకు తొడ్పాటు ఇవ్వాలన్నారు. సచివాలయ పరిధిలోని గృహానిర్మాణపథకం, ఓటిఎస్‌, పెన్షన్‌, నిత్యవసర వస్తువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పారిశుద్ద్య కార్యక్రమాలలో భాగంగా తడి,పొడి చెత్తను వేరువేరుగా పారిశుద్ద్య కార్మికులకు అందించే విధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. ప్రజల నుండి సచివాలయానికి వచ్చే సమస్యలను మరల తిరిగి రాకుండా సంబందిత అధికారులతో శాశ్వత పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక ఉద్యోగుల మూమ్మెంట్‌ రిజిస్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌, ఎస్‌ఎల్‌ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్లు తదితర వాటిని జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌ పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ప్రతి రోజూ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించి ప్రజల మన్నలను పొందాలన్నారు. ఇప్పటివరకు సచివాలయాలనికి వచ్చిన సమస్యలు, పరిష్కరించిన వాటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వార్డు పరిధిలో లబ్దిదారుల జాబితాను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. సచివాలయాల పరిసరాలలో పచ్చదనాన్ని పెంచుతూ పరిశుభ్రతను పాటించాలన్నారు. ఆధార్‌ లింక్‌ ప్రక్రియ నిర్వహించే సచివాలయాలలో అడ్రర్స్‌ మార్పులు ఇతర మార్పులు చేర్పులకు సంబంధించి ప్రక్రియలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సచివాలయాలకు సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహపూర్వకమైన వాతావరణంలో వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట సెంట్రల్‌ తహాశీల్థార్‌ వెన్నెలశ్రీనివాస్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *