ప్రజారోగ్య భద్రతకు పటిష్టమైన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా వుండాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని, ఆ మేరకు జిల్లాలో  ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమంలో ప్రజారోగ్య భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్లో ఉత్తమ వైద్య సేవలు అందచేసిన వైద్యులను జిల్లా కలెక్టర్ చేతులమీదుగా శాలువ, మెమంటో అందచేసి సన్మానించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం క్రింద గర్భిణీ, బాలింతలు, ధీర్ఘకాలికా వ్యాధులతో బాధపడే వారు,  ఆరోగ్యశ్రీ, శస్త్ర  చికిత్సల రోగులకు , స్కూల్ మరియు అంగన్వాడీ స్కూల్ లో ఆరోగ్య పరీక్షలు చేసి ఉత్తమ వైద్య సేవలు అందించిన 5 గురు  వైద్యులను   సన్మానించుట  జరిగిందని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో  ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా కోరుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా.రవిచంద్ర, సీతానగరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా. రాజు, కలవలపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా.సౌజన్య, డా.అవినాష్ మరియు  దోసకాయలపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా. ఈషా జ్యోతి లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. కే. వెంకటేశ్వర్రావు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి, డా. ఎన్ వసుందర , వైద్యులు డా.మౌనిక, డా.అబిషేక్, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *