-విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను పెంచుకోవాలి
-ఇద్దరు దివ్యాంగులకు లాప్ టాప్ లు అందుచేత
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులను అభ్యశిస్తూ తమ ప్రతిభా నైపుణ్యాలతో ప్రస్తుత సమాజంలో పోటీని ఎదుర్కొని నిలవాలన్నదే ప్రధాన లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యనిస్తూ, మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు సమావేశ మందిరం స్పందన కార్యక్రమంలో రూ.70 వేల రూపాయలు విలువ గల రెండు లాప్ ట్యాప్ లను డిగ్రీ చదువుతున్న విద్యార్థులు రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామం జుత్తిగ సుబ్రహ్మణ్యం(అంధత్వం), సీతానగరం మండలం జల్లిమూడి గ్రామానికి చెందిన సిద్దా కిరణ్ కుమార్(చెవిటి,మూగ) విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ దరఖాస్తు చేసిన నాలుగు మాసాల్లోనే మా చదువు నిరాటంకంగా కొనసాగేందుకు సహకరించే ల్యాప్ అందించి ప్రభుత్వం మాకు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డి ఆర్ వో జి నరసింహులు, విభిన్న ప్రతిభా వంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టరు వి.కామరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News