-అర్హులైన లబ్ధిదారులందరికీ వారి ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తున్నాం.
-రాష్ట్ర హోం మంత్రి, డా. తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ , సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి అర్హులైన లబ్ధిదారులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను వారి ఇంటి వద్దకే అందించడం జరుగుతుందని రాష్ట్ర హోం మం త్రి, డా. తానేటి వనిత అన్నారు. కొవ్వూరు 15 వ వార్డు రామాలయం వద్ద సోమవారం గడప గడపకు మ న ప్రభుత్వం కార్య క్రమంలో మంత్రి వనిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా అందించిన ఘనత వై.యస్ జ గన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రతి కుటుంబానికి అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, ఆసరా, పెన్షన్ వంటి వివిధ పథకాలు అందుతున్నాయని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కు అర్హత పొందాలన్నా, పెన్షన్ తీసుకోవాలన్న వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లని గుర్తుచేశారు. ప్రజా సమస్య లను తెలుసుకొని సంక్షేమ పాలన సీఎం జగనన్న అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కరించ డానికి ప్రత్యేక దృష్టి సారిచిం దన్నారు. రాష్ట్రం లో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, జగనన్న ప్రభుత్వం నామినేటడ్ పదవు ల్లో 50 శాతం రిజర్వేష న్ కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని, అర్హులకు అన్ని సం క్షేమ పథకాలను అం దచేసే విధంగా చర్యలు తీసు కోవడం జరుగుతోందని వనిత పేర్కొన్నారు. మంత్రి ఇంటింటి కి వెళ్లి 3 సంవత్సరాలు ప్రభుత్వం అందచేసిన సంక్షేమ పధ కాలను వివరించారు. స్థానిక స మస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్సీ కోడూరి శివరామకృష్ణ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వల్లభశెట్టి గంగాధర శ్రీనివాస్, జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్, పోసిన శ్రీలేఖ, కొ వ్వూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్లు గండ్రోతు అంజలీ దేవీ, కొవ్వూరు తాహిసీ ల్దార్, బి. నాగరాజు నాయక్, మునిసి పల్ కమీషనర్, బి. శ్రీకాంత్, రుత్తల భాస్కరరావు, కౌన్సి లర్లు అక్షయ పాత్ర శ్రీనివాస రవీంద్ర, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News