జిల్లాలో 2022-23 లో జగనన్న తోడు రుణాలు రూ.606 లక్షలు

-వడ్డీ రాయితీ గా విడుదల చేసిన రూ.71.87 లక్షలు
-జగనన్న తోడు రుణాలు చెల్లించడం ద్వారా తిరిగి రుణాలు పొందవచ్చు
-కలెక్టర్ కే. మాధవీలత
-ఎంపి మార్గాని భరత్ రామ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న తోడు రుణాలు సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు అందచేసే వడ్డీ రాయతీ ప్రయోజనాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు.

బుధవారం తాడేపల్లి లోని సి ఎం క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న తోడు 6వ విడత రుణ మంజూరు, వడ్డీ రాయతీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా నిర్వహించి విడుదల చేయగా…. జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, 202-23 లో జగనన్న తోడు ద్వారా 28,938 మందికి రూ.71.88 లక్షలు రాయితీ అందించడం జరిగిందన్నారు.  జగనన్న తోడు పథకం కింద తిరిగి రుణాలు చెల్లించిన వారికి ఉదారంగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్ల ను కోరడం జరిగింది. ఆమేరకు బ్యాంకర్ల కూడా సానుకూలంగా స్పందించారని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 15261 మందికి జగనన్న తోడు కింద దరఖాస్తులు చేసుకోగా 8,027 మందికి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసి 6,061 మందికి రూ.606.10 లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.

2022-23 సంవత్సరంలో ఆరోవ విడతలో రుణ మంజూరు, వడ్డీ రాయతీ విడుదల వివరాలు తెలుపుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1930 మందికి ₹.193 లక్షలు, 21,080 మందికి వడ్డీ రాయితీ రూ 52.63 లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన 4131 మందికి ₹.413 లక్షలు, 7,858 మందికి వడ్డీ రాయితీ రూ .19.24 లక్షలు ఇవ్వడం ద్వారా జిల్లాలో మొత్తం 606.10 లక్షలు, రూ.71.87 లక్షల వడ్డీ రాయితి  అందించడం జరిగిందన్నారు.

స్థానిక పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ జగనన్న తోడు వడ్డీ రాయతి కింద తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లబ్ధిదారులకు గత ఆరు విడతల్లో  60,825 మందికి  94,530 రుణాలు  మంజూరు చేయడం ద్వారా రూ.2.54 కోట్ల మేర వడ్డీ రాయతి లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు.  జగనన్న ఆ మొత్తాలను డి.బి.టి. ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాకు జమ చేయడం ద్వారా మరింత ప్రయోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వారు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయతీ కి అర్హత సాధించాలని పేర్కొన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందిస్తూ ఆర్థిక చేయూత నిస్తున్నారన్నారు. నేడు చిరు వ్యాపారులకు కూడా వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వారి వ్యాపార అభివృద్ధికి ఎంతో తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు.

2022-23 లో నియోజక వర్గాల వారీగా :

జగనన్న తోడు కింద అందచేసిన రుణాలు
కొవ్వూరు 3,172 మందికి రూ.8.01 లక్షలు ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు రూ.27.89 లక్షలు , గోపాలపురం 2,368 మందికి రూ.4.64 లక్షలు ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు రూ.21.12  లక్షలు , నిడదవోలు 5,567 మందికి రూ.14.72  లక్షలు ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు రూ.46.47 లక్షలు ,
రాజమహేంద్రవరం రూరల్ 2,445 మందికి రూ.5.36  లక్షలు ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు రూ.24.20 లక్షలు ,  రాజమండ్రీ నగరం 6,334 మందికి రూ.14.69  లక్షలు ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు రూ.55.73 లక్షలు ;  అనపర్తి 2,749 మందికి రూ.7.04 లక్షలు ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు రూ.22.69 లక్షలు; ,  రాజానగరం 5,644  మందికి రూ.16.18 లక్షలు ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు రూ.49.46 లక్షలు , జగ్గంపేట (గోకవరం మండలం) 659 మందికి రూ.1.24 లక్షలు ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు రూ.6.83 లక్షలు మేర ప్రయోజనం చేకుర్చగలిగాం అని అన్నారు.

జెడ్పీ చైర్మన్ వి. వేణుగోపాల్, డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు,రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, రాష్ట్ర ఖాదీ బోర్డ్ చైర్మన్ పిల్లి నిర్మల, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్,  డి ఆర్ డి ఎ పిడి ఎస్. సుభాషిణి, డిఆర్డిఏ సిబ్బంది,  జగనన్న తోడు లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *