అభివృద్ధి పనులు పై సమీక్షా సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి సమీక్ష లో చేపట్టవలసిన పెండింగ్ పనులు, ప్రతిపాదించే పనులపై నియోజక వర్గాల వారిగా శాఖల వారీగా సమీక్ష నిర్వహించామని హోం మంత్రి డా తానేటి వనిత, ఎంపి మార్గని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత పేర్కొన్నారు.

స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం హోం మంత్రి డా. తానేటి వనిత అధ్యక్షతన సిఎం తో జరిగే సమీక్ష నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, అభివృద్ధి పనులు పై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత , ఎంపి మార్గని భరత్ రామ్, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ప్రతిపాదించి చేపడుతున్న పనులు, మరింత సమర్ధవంతంగా పూర్తి చేసే క్రమంలో సూచనలు, సలహాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గాల వారిగా పనుల పురోగతి, తయారు చెయ్యవలసిన పనులు పై సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు లపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఏ పనులు చేపట్టడం ద్వారా అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజా ప్రతినిధుల ద్వారా పలు ప్రతిపాదనలు చేశారన్నారు. ఇప్పటికే ప్రతిపాదన చేసిన వాటికంటే ఇంకా మెరుగైన వాటిని సూచించాలని తెలియచేశారు. క్షేత్ర స్థాయి లో వాస్తవ పరిస్థితిని బట్టి ప్రజా ప్రతినిధులు చేసే ప్రతిపాదనలను కూడా మీరు సిఫార్సు చెయ్యాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దృష్టి కు తీసుకుని వెళ్ళడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మద్దూరులంక గట్టు పటిష్టం కోసం చేసిన ప్రతిపాదన పనులు, అరికరేవుల ఎత్తి పోతల పథకం, సత్యసాయి వాటర్ స్కీమ్ కొవ్వూరు నియోజక వర్గం లో అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగాను, తాళ్లపూడి గ్రామంలో రహదారి, డ్రైనేజ్ తదితర పలు ప్రతిపాదిత పనులపై సమీక్ష నిర్వహించి, ప్రస్తుత యదార్థ స్థితి పై ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో సమీక్షించారు.

రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో చేపట్టిన, చేపట్టవలసిన. అవసరమైన పనులు, వాటికి చెందిన నిధుల కేటాయింపు, ఖర్చులు, భవిష్యత్తు కార్యాచరణ పై ఎంపి మార్గని భరత్ రామ్ సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం గోదావరీ బండ్, ఇతర అభివృద్ధి పనులు కోసం ప్రతిపాదించిన రూ 80 కోట్లకు గాను రూ.22 కోట్ల నిధులు విడుదల చేశారని అధికారులు తెలిపారు. ఆవా ఛానల్, గోదావరీ బండ్ అభివృద్ధి పనులు, తోర్రేడు ముంపు సమస్య నివారణ, పొట్టిలంక వంతెన, వేమగిరీ రహదారి విస్తరణ, అనపర్తి నియోజక వర్గంలో కెనాల్ రోడ్ పనులు, రహదారి పనులు, రంగంపేట-సింగం పేట రహదారి, పెద్దాపురం ఏడీబి రహదారి పనులు తదితర ప్రతి ఒక్క అంశాన్ని సమగ్రంగా చర్చించడం జరిగింది.

ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్,  మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు,  ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఇరిగేషన్ ఎస్ ఈ జీ. శ్రీనివాస రావు, ఏ డీ మైన్స్ ఎమ్. విష్ణువర్ధన్, జిల్లా హౌసింగ్ అధికారి బి తారా చంద్,  ఆర్ అండ్ బి ఈఈ  ఎస్ బి వి రెడ్డి,   డి పి వో పి. జగదంబ, ఎస్ ఈ (విద్యుత్) టి వి ఎస్ ఎన్ మూర్తి,  ఎస్ ఈ ( పి అర్) ఎస్ బి వి ప్రసాద్, ఎస్ ఈ (ఆర్డబ్ల్యుఎస్) డి. బాల శంకర్ రావు , డి ఈ వో ఎస్. అబ్రహం, ఆర్ అండ్ బి ఈ ఈ లు బి. వీరభద్రరావు, ఐ. దేవేంద్ర నాథ్, సి పి వో (ఐ సి) శ్రీనివాస రావు, డి ఈ మధు,  డి ఎల్ డి వో పి.వీణా దేవి, వి.శాంత మణి తదితరులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *