రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యములో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను స్థానిక సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆపరేషన్, విద్యుత్ భవన్, రాజమహేంద్రవరం వారి కార్యాలయం / ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్, రాజమహేంద్రవరం, కాకినాడ, జగ్గంపేట, రామచంద్రపురం, అమలాపురం, రంపచోడవరం కార్యాలయములలో జనవరి నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించటం జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగుతుందని పర్యవేక్షక ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం టి. వి. యస్. ఎన్. మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిరోజు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్ కు సంబంధించిన సూచనలు అభ్యంతరాలు వినడం జరుగుతుంది. విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమం ఆయా తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంట వరకు అలాగే మధ్యాహ్నం 02:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహిస్తారని, ఈ ధరలపై సందేహాలు, సలహాలు సూచనలు ఇచ్చేందుకు వినియోగదారులెవరైనా పాల్గొనవచ్చునని, ఈ మేరకు రిజిస్ట్రేషన్ కొరకు స్థానిక విద్యుత్ సర్కిల్ కార్యాలయములో లేదా ఏదైనా సమీప విద్యుత్ డివిజన్ కార్యాలయములలో సంప్రదించాలని కోరటమైనది. ప్రతిరోజు ముందుగా నమోదు చేసుకున్న వినియోగదారుల అభ్యంతరాలు విన్న తరువాత విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో నమోదు చేసుకోని వినియోగదారుల అభ్యంతరాలు వినడం జరుగుతుంది అని తెలియపరచుచున్నాము.
Tags rajamendri
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News