-రాష్ట్ర భట్రాజ సంఘం మహిళా అధ్యక్షురాలు పాలగిరి .చంద్రకళ పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ భట్రాజుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర భట్రాజు సంఘం మహిళా అధ్యక్షురాలు పాలగిరి చంద్రకళ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. భట్రాజు పొగడ్తలు అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు తమ మనోభాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. తమ సంఘం విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20.12.2022 న భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధిస్తూ జీవో నెంబర్ 60 జారీ చేశారని తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం ఎవరైనా ఈ పదాన్ని ఉపయోగిస్తే వాళ్లు శిక్షార్హులని, జీవో వచ్చినప్పటికీ కొంతమంది తమ మనోభావాలను కించపరుస్తూనే ఉండటం తగదన్నారు. పాలకొల్లును ఉద్దేశించి మా వెనకాల పందులు, మా ముందర దండ నాయకులు మొదలైన వారు బట్రాజు పొగడ్తలతో గ్రామ సింహాలుగా వచ్చేవారు అంటూ తీవ్ర అభ్యంతరసరమైన భాషను సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో “అనంత శ్రీరామ్” సినీ రచయిత అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమన్నారు.. అనంత శ్రీరామ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు, అతనిపై కేసులు నమోదు చేయడం ద్వారా మనోభావాలను కాపాడాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పోలీసుస్డేషన్లలో అనంత శ్రీరామ్ పై ఫిర్యాదులు ఇవ్వాలని రాష్ట్ర భట్రాజులను కోరారు. భవిష్యత్తులో ఎవరైనా భట్రాజు పొగడ్తలు అనే పదం వాడితే వారు ఎంతటి వారైనా ఊరుకోమని భట్రాజులుగా హెచ్చరిస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News