-ఉగాది నాటికి 5 లక్షలు ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించాం.
-ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలి.
-ఇళ్ల నిర్మాణం కొరకు లబ్ధిదారులకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుంది.
-గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇం జనీర్, జి. వి. ప్రసాద్
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలకు ఇళ్ళు పధకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 19 లక్షల గృహ నిర్మించేందుకు అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్, జి. వి. ప్రసాద్ పేర్కొన్నారు.
గురువారం కొ వ్వూరు పట్టణం లో జగనన్న కాలని లే అవుట్ 2 లో గృహనిర్మాలను చీఫ్ ఇంజనీర్, జి. వి. ప్రసాద్ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు ఈ సందర్బంగా ఆయ మాట్లాడుతూ రాష్ట్రంలో పి ఎం ఈ వై అర్బన్ 16.8 లక్షలు గ్రామీణ్ ప్రాంతాల్లో 1.79 లక్షల ఇళ్ళు నిర్మించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఉగాది నాటికి 5 లక్షలు ఇళ్ళు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 2.5 లక్షల ఇళ్ళు నిర్మాణ దశను పూర్తి చేసుకున్నాయన్నారు. మరో లక్ష ఇళ్ళు స్లాబ్ దశకు వచ్చాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇవ్వటమే కాకుండా, ఆ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక చేయూత తో పాటుగా ఇసుక, సిమెంట్, ఐరన్, నీటి వనరులు ఆయా లే అవుట్ వద్దనే గృహాలు నిర్మించుకునే లబ్దిదారులకు అందుబాటు లోకి తీసుకుని వస్తున్నామని అన్నారు. పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలులో భా గంగా చేయూతను ఇస్తున్న ట్లు పేర్కొన్నారు. పూర్తి చేసిన ఇండ్లకు విద్యుత్ సరఫరా కూడా ఇవ్వ డం జరుగుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అర్హులైన పేద వారందరికీ సొంత ఇంటి కలనుసాకారం చేసేందుకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలను మంజూరు చేసి ఇళ్లను నిర్మిస్తుందని లబ్ధిదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించి పూర్తిస్థాయిలో లక్ష్యాలు నెరవేర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
కొవ్వూరు అర్బన్ లో 2832 మందికి ఇళ్ళు మంజూరు కాగా ఇప్పటి వరకు 204 ఇళ్ళు పూర్తి అయ్యాయి. 104 ఇళ్ళు రూఫ్ నిర్మాణ దశ ల్లో, 930 ఇళ్ళు బేస్ మెంట్ లెవెల్ ల్లో ఉన్నాయని అన్నారు. ఉగాది నాటికి 3 లే అవుట్ ల్లో కలిపి 355 టార్గెట్ కాగా ఇప్పటి వరకు 40 ఇళ్ళు పూర్తి అయ్యాయని, మరో 315 ఇళ్ళు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ డి. ఈ, ఎం. శ్రీనివాసరావు, ఏఈ లు, డి. ఎస్. చాంబార్లీన్, కె. ఎస్. చక్రవర్తి, సచివాలయ సిబ్బంది, పలువురు లబ్దిదా రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News