అర్జీలకు రక్షణ పరిష్కారం చూపాలి

-స్పందనకు వొచ్చిన అర్జీలు 167
-అర్హత లేని, తిరస్కరణ చేసిన అర్జీ కు సహేతుకమైన కారణం ఇవ్వాలి
-నవశకం పోర్టల్ ద్వారా సచివాలయ సిబ్బంది అర్జీల ను అప్లోడ్ చెయ్యాలి
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి వచ్చే ప్రతి ఒక్క అర్జీ నిర్ణీత సమయం లో పరిష్కారం చెయ్యడం తో, అపరిష్కృతంగా ఉన్న వాటికి చెంది అర్జీ దారులకు సహేతుకమైన వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.

సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జవాబుదారీతనం తో కూడిన పరిష్కారం చూపాలని స్పష్టం చేయడం జరిగిందన్నారు . అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలని ఆ దిశలో డైరెక్ట్ బెనిఫిట్ నగదు బదలీ రూపంలో నేరుగా ఆర్థిక ప్రయోజనాలు లబ్దిదారుల ఖాతాకు బదలీ చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈరోజు వివిధ సమస్యలపై 167 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. నవశకం పోర్టల్, జగనన్న కి చెబుదాం 1902 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే అర్జీలు పారదర్శకంగా పరిశీలన చేసి పరిష్కారం చూపడం పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, నవశకం పోర్టల్ ద్వారా ప్రతి గ్రామ సచివాలయ కార్యదర్శి, సిబ్బంది అర్జీలను కుటుంబ సభ్యుల డేటా ఆధారంగా ఆరు దశల వివరాలతో క్రోడికరించడం జరుగుతుందని తెలిపారు. వాటిని ఆయా సచివాలయాల్లో కంప్యూటరీ కరణ బాధ్యత సిబ్బంది తీసుకుని నవశకం పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. సాధారణంగా పెన్షన్ నిలుపుదల, ఇన్ కమ్ ట్యాక్స్, కరెంట్ బిల్లులు, రేషన్ కార్డు లో పేర్లు సవరణ తొలగింపు, అధిక వ్యవసాయ భూమి కలిగి ఉండడం తదితర వివరాలు వలన సంక్షేమ పథకాల లబ్ది పొందకుండా ఉండడం గుర్తించి, నవశకం పోర్టల్ ద్వారా వాటిని సరిచేసే వీలు ప్రభుత్వం కల్పించిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇందుకు గాను అర్జీ దారులు ఇచ్చే వివరాలు వాస్తవం అని చెపుతూ అఫిడవిట్ దాఖలు చేయడం జరగాలన్నారు. అర్జీ దారులు అందచేసిన వివరాల ప్రకారం సంబంధిత అధికారులు రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ అధికారులే భాధ్యత దృవీకరణ చెయ్యడం జరగాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అర్జీదారులే ధ్రువపత్రాలు అందించడం జరగదని తెలిపారు. సంబంధిత అధికారులు ఈ విషయంలో బాధ్యత తీసుకోవలసి ఉంటుందన్నారు.

స్పందనలో వొచ్చిన అర్జీలు:
బొమ్మూరు టిడ్కో గృహ సముదాయాలలో, రెవెన్యూ కాలనీ లో నివాసం ఉన్న కుటుంబాలు 6.2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ స్మశాన వాటిక నిర్వహిస్తున్న దృష్ట్యా అక్కడ నుంచి వేరే చోటుకి మార్చాలని స్పందన లో వి. దుర్గా,  ఎస్. లతా కుమారి, ఎఫ్. రాణి  తదితరులు అర్జీ అందచేశారు. ఆసుపత్రి, ఆట స్థలం వంటివి ఏర్పాటు చేసేందుకు అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. రూరల్ తహశీల్దార్ ను వేరే చోట అనువైన ప్రదేశం చూపి నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంపు, ఫేస్ యాప్ రద్దు, మెను ఛార్జీలు పెంపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు తదితర 15 అంశాలతో కూడిన అర్జీ ను కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కు అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి కె. సుబ్బరావమ్మా ఆధ్వర్యం లో వినతి పత్రం అందజేశారు.

గోపాలపురం గ్రామానికి చెందిన బాలం నాగేశ్వర రావు తన పెళ్ళైన కుమార్తె ఇప్పటికి తన రేషన్ కార్డు లో ఉండడం చేత వికలాంగుల పెన్షన్ సౌకర్యం ఆగస్ట్ నెల నుంచి ప్రభుత్వం నిలుపుదల చేసినదని, కావున రేషన్ కార్డు నుంచి తన కుమార్తె పేరు తొలగించేందుకు అర్జీ అందచేశారు. తన కుమార్తె పెరవలి సచివాలయం లో చెయ్యడం వల్ల తన పెన్షన్ సౌకర్యం కోల్పోవడం జరిగిందని, తనకు ఆధారమైన పెన్షన్ పునరుద్ధరణ చెయ్యాలని కోరారు.. పరిశీలన నిమిత్తం డి ఎస్ వో, తహశీల్దార్ లకు సిఫార్సు చేశారు.

రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన గొంతుముక్కల భాస్కర రాణి తమ అర్జీలు వివరిస్తూ తాను 2007 సంవత్సరంలో ఇంటి కొరకు 5000 రూపాయలు చెల్లించాలని, తనకు స్థలము గాని ఇల్లు గాని ప్రభుత్వం నుండి మంజూరు కాలేదని అర్జీలో కోరారు

నల్లజర్ల మండలం తెలికచర్ల గ్రామానికి చెందిన రైతు తోట లక్ష్మణరావు తన అర్జీలో సదరు గ్రామానికి చెందిన తుమ్మల సుబ్బారావు తన వద్ద నుండి వ్యవసాయ బోరుబావికి అమర్చే వాటర్ ట్యూబ్ ను రోజుకు 300 రూపాయలు చొప్పున అద్దెకి తీసుకున్నాడని, ఇంత వరకు అద్దె గాని వాటర్ ట్యూబ్ గాని తనకు ఇవ్వలేదని కావున న్యాయం చేయాలని అర్జీలో కోరారు.

రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన ముమ్మిడివరకు చెన్నమ్మ తన అర్జీలో సర్వేనెంబర్ 396/ 503 లో ఉన్న 25 సెంట్లు తన భూమిని చంపర చంటి అనువారు తమ భూమిని తీసుకొని వేధిస్తున్నారని, కావున సమస్యలను పరిష్కరించ వలసిందిగా వారు ఆర్జీలో కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా రాజానగరం తహశీల్దార్ ను ఆదేశించారు

ఈ స్పందన కార్యక్రమానికి డి అర్ వో జీ. నరసింహులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *