ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ 11 టీమ్ సభ్యులు కెప్టెన్ కె. దినేష్ కుమార్, జేసీ తేజ్ భరత్ ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత టీమ్ వర్క్ గా అడుగులు వేస్తే ఏ రంగంలో నైనా విజయం సాధించగలమన్నారు. ఇదే క్రీడా స్పూర్తి ని విధుల్లో కూడా చూపించడం ద్వారా జిల్లాను అగ్రస్థానం లో నిలిపెలా పని చేయాలని అన్నారు. మునిసిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ , జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు ఎంతో క్రమశిక్షణ తో కూడి సరైన దిశా నిర్దేశం చెయ్యడం ద్వారా విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కమిషనర్ కె.దినేష్ కుమార్ కలెక్టర్ మేడం ప్రోత్సాహంతో విజయం సాధించడం సాధ్యం అయినదని అన్నారు. ఇదే స్పూర్తదాయకంగా తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలమని అన్నారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో టీమ్ సభ్యులు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, టీిం సభ్యులు జి. బాపిరాజు, ఎన్.గోపీచంద్, కేవి ప్రసాద్ , వినోద్ , రెడ్డి అరవింద్, నాగేంద్ర తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *