ఘనంగా జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు 2023

-సైన్స్ పై ఆసక్తి కలిగేలా మూఢనమ్మకాలను పారద్రోలేలా బోధన ఉండాలిఎమ్మెల్సీ
-భావి భవిష్యత్తుకు శాస్త్రవేత్తలు ఎంతో అవసరంకలెక్టర్
-పేదలకు కూడా ఉన్నతమైన నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వంఎమ్మెల్యే

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన లు ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ మరియు నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్(NCSC) తో పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నవనీ కరోనా అనంతరం మనం ఈ సంవత్సరం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను నేటి సోమవారం RPBS జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) వేదికగా జరుపకోడం ఎంతో సంతోషించదగినదని సైన్స్ పైన ఆసక్తి కలిగేలా బోధన ఉండాలని, సైన్స్ ద్వారానే భవిష్యత్తు ఉందని ఎంఎల్సి విఠపు బాల సుబ్రమణ్యం వారు అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలి అని తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణా రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యతోనే ఉన్నతమైన పదవులు పొందవచ్చని, విద్యతోనే ఏదైనా సాధ్యం అని, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 6000 కోట్లు పైగా ఖర్చు చేసి విద్యా వ్యవస్థకు మౌలిక వసతులు, ఆంగ్ల విద్యా బోధన, బైజూస్ ట్యాబ్ లు అందించి శ్రీమంతులకు అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు కూడా అందుబాటులో కి తెచ్చారని తెలిపారు.

సోమవారం RPBS జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు), శ్రీకాళహస్తి లో ఘనంగా జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు- 2023 ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎంఎల్సి విఠపు బాల సుబ్రమణ్యం, ఎం ఎల్ ఎ బియ్యపు మధుసూదన రెడ్డి , జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాను ఏర్పేడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివానని తెలుపుతూ నార్మన్ బోర్లో అనే వ్యక్తి తన నిజ జీవితంలో వాతావరణ, పంటలలో జరుగుతున్న మార్పులను గమనించి నూతన గోధుమ, వరి వంగడాలకు నాంది పలికి కోట్ల మంది ఆకలి తీర్చారని అన్నారు. సైన్స్ బోధించడం విద్యార్థులకు హృదయానికి హత్తుకునేలా ఉండాలని వారిలో ఒక ఆలోచన రేకిత్తించే విధంగా ఉండాలని, మూఢ నమ్మకాలు ఉండకుండా సైన్స్ సందేహాలను నివృత్తి చేసేలా ఉండాలని అన్నారు. విద్యా విధానంలో అలా సైన్స్ బోధన పక్కాగా జరగాలని భవిష్యత్తు సైంటిస్ట్ లను తయారు చేసేలా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా పలు సందర్భాలు ఉదహరించి విద్యార్థులకు అవగాహన ఉత్తేజం కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని వాటిలో అనేక పథకాలను నిబద్ధతగా అమలు చేస్తోందని అన్నారు. ఎంతో మంది విద్యార్థులు రక్తహీనతతో బాధ పడుతున్న పిల్లలను గుర్తించి వారికి మంచి నాణ్యమైన రుచికరమైన పోషకాహారం అందిస్తోందని ఉన్నత స్థాయిలో ఈ అంశంపై ప్రతి రెండు వారాలకు సమీక్షిస్తున్నారు అని రక్తహీనత ఉంటే చదువు మీద ఆసక్తి తగ్గుతుంది అని, దీనిని అధిగమించడానికి జగనన్న గోరుముద్ద పకడ్బందీగా అమలు చేసి చిక్కీ లు, రాగి జావ, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ సక్రమంగా వినియోగించు కోవాలి అని అన్నారు. భవిష్యత్తులో ఏమైతారు అని విద్యార్థులను అడిగితే సామాన్యంగా ఐఎఎస్, ఐపి ఎస్, ఇంజినీర్, టీచర్ ఇలా చెప్తారని, కానీ సైంటిస్ట్ అని చెప్పడం అరుదు అని, సైంటిస్ట్ లు వివిధ రంగాలలో వినూత్నమైన వాటిని భవిష్యత్తు ప్రయోజనాలకు అందించే గొప్ప వారు అని అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి అని, యువ శాస్త్రవేత్తలను తయారు చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం అని వచ్చే సంవత్సరం మరింత సృజనాత్మక పరిశోధనలను ప్రదర్శించేలా ఉండాలని అన్నారు.

గత డిసెంబర్ నెలలో 14,15 తేదీలలో మండల స్థాయిలో అన్ని పాఠశాలల నుంచి మండల స్థాయి ఎగ్జిబిట్లను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. 5 సబ్ థీమ్స్ నుండి ఎంపిక చేసిన వాటిని 34 మండలాల నుండి మొత్తం170 ఎగ్జిబిట్లు నేడు ప్రదర్శనలో ఉంచడం జరిగిందనీ, ఇవి అన్నీ కూడా సృజనాత్మకత తో విద్యార్థులు తమ గైడ్ టీచర్ సహాయంతో నూతన ఆవిష్కరణలకు నాంది పలికే విధంగా ప్రస్తుత మన జీవన శైలిలో వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయని అన్నారు.

అనంతరం ఎమ్మెల్సీ తో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.

కమిషనర్ పాఠశాల విద్యాశాఖ వారి ఆదేశానుసారము జిల్లా స్థాయిలలో సైన్స్ ప్రదర్శనలు నిర్వహించిన ఉపఅంశములు
1.ECO FRIENDLY MATERIAL( పర్యావరణ అనుకూల సంబంధిత) = 34
2.HEALTH AND CLEANLINESS( ఆరోగ్యము మరియు పరిశుభ్రత) = 34
3.SOFTWARE AND APPS(సాఫ్ట్వేర్ అండ్ యాప్స్) = 34
4.ENVIRONMENTAL AND CHANGES( పర్యావరణ మరియు వాతావరణ మార్పులు) = 34
5.MATHEMATIC MODELS( గణిత నమూనాలు) వెరసి మొత్తం 34 ఇందులో ఐదు ఉప అంశముల నుండి ఎంపిక చేయడం జరుగుతుందనీ ఇందులో ప్రధమ మరియు ద్వితీయ స్థాయిలో గెలుపొందినటువంటి ఎగ్జిబిట్లను మొత్తం ఐదు సబ్ థీమ్ ల నుండి 10 ఎగ్జిబిట్లను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందనీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ రామారావు, డిఇఓ శేఖర్, డిప్యూటీఈవో రఘు రామయ్య, జిల్లా సైన్స్ అధికారి భాను, ఎం.ఇ.ఓ. భువనేశ్వరి ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, ఉపాధ్యాయులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *