ప్రతి ఉద్యోగి ఎఫ్.ఆర్.ఎస్.హాజరు తప్పనిసరి…

-పూర్తి అయిన రీసర్వే భుహక్కు పత్రాలు పంపిణీ పూర్తి కావలి.
-ఎస్.సి.కాలనీల శ్మశాన వాటికలు స్థలాల కేటాయింపు పూర్తిచేయండి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ ఆధారిత హాజరు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరి నమోదు చేయాలని, రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో భుహక్కు పత్రాల పంపిణీ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి అన్నారు. సోమవారం అమరావతి నుండి ముఖ్యమంత్రి అడిషనల్ కార్యదర్శి ముత్యాలరాజు అన్ని జిల్లా ల కలెక్టర్లతో , జేసి లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్, జేసి డి.కె.బాలాజీ, స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి హాజరయ్యారు. అన౦తరం సంబధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి వంద శాతం ముఖ ఆధారిత హాజరు నమోదు జరగాలని అన్నారు. చాలా చోట్ల మండల స్థాయిలో ఇంచార్చ్ లుగా వున్న కార్యాలయాల్లో ఎఫ్ ఆర్ ఎస్ నమోదు కాలేదని, ఇంచార్జులుగా వున్న అధికారుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి సమర్పించాలని పదోన్నతి అవకాశాలు కల్పించే అవకాశం వుందని సూచించారు. జిల్లాలో చుక్కల, అనాదీనం భూముల వివరాలు సిద్డంచేయాలని , రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో పెండింగ్ లేకుండా భుహక్కు పత్రాల పంపిణీ చేపట్టాలని సూచించారు. ఎస్.సి.కాలనీలకు శ్మశాన వాటికల గుర్తింపు , కేటాయింపు త్వరగా జరగాలని సూచించారు. మరమ్మత్తుల అవసరమున్న రోడ్లు , గడప గడప లో అందిన రోడ్ల వివరాల అంచనాలు పూర్తిచేసిన జాభితా త్వరగా అందించాలని ప్రభుత్వానికి పంపాలని, అనుమతులు వచ్చిన వెంటనే పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీర్ శంకర నారాయణ, జిల్లా ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి, ఎస్.సి సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య , ఇంచార్జ్ ఎఒ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *