-జగనన్న కాలనీకి ప్రతిపాదించిన ప్రాంతంలో పర్యటించడం జరిగింది
-మెరక పనులు, రహదారుల, ఇతర మౌలిక సదుపాయాల పై సూచనలు చేసాము
-కలెక్టర్ మాధవీలత
-స్కూటర్ పై కలెక్టర్ మాధవీలత, మోటర్ సైకిల్ పై జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ పరిశీలన
కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కోసం గుర్తించిన ప్రాంతాన్ని పరిశీలించి తగిన సూచనలు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె . మాధవీలత తెలిపారు. బుధవారం కోరుకొండ మండలం కాపవరం, బూరుగుపూడి గ్రామాల పరిధిలో 25 వేల మంది లబ్ధిదారుల కోసం ఇళ్ళ స్థలాలు పంపిణీ కి గుర్తించిన 586 ఎకరాల భూమిని జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్క పేద వానికి సొంత ఇంటి కల సాకారం చేయవలసిన బృహత్తరమైన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల సాకారం ధ్యేయంగా దరఖాస్తు చేసుకున్న 90 రోజులలో ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బూరుగుపూడి, కాపవరం గ్రామాల్లో గుర్తించిన ప్లాట్స్ ను రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కోరుకొండ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. లే అవుట్ ల అభివృద్ధి, స్థలాలు కేటాయింపులు తదితర అంశాలపై మండల స్థాయి అధికారులు, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ , రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో వొచ్చే కాలనీ కి చెందిన రహదారి, త్రాగు నీటి వ్యవస్థ, మెరక పనులు చేయడం క్షేత్ర స్థాయి లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. తొలుత జగనన్న కాలనీ కోసం ప్రతిపాదించిన ప్రాంతానికి చేరుకున్న కలెక్టర్ సచివాలయ కార్యదర్శి స్కూటర్ పై కలెక్టర్ మాధవీలత, మోటర్ సైకిల్ పై జాయింట్ కలెక్టర్, దినేష్ కుమార్ పరిశీలన చెయ్యడం గమనార్హం. ఈ లే అవుట్ కు చెందిన ఇళ్ళ స్థలాల లే అవుట్ మ్యాప్ పాయింటింగ్, రహదారి మార్గాలు ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన గురించి మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పై జేసీ తో కలిసి కలెక్టర్ సమీక్ష చేసి, దిశా నిర్దేశం చేశారు. లే అవుట్ లేవలింగ్ పనులు, ఏ మార్గం లో రహదారి పనులు చేపట్టడం ద్వారా ఇంటి నిర్మాణం కోసం తరలించే సామగ్రి సరఫరా చేయడం సులభం అవుతుందనే దిశలో దశల వారీగా చేపట్టే ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు.
ఈ పర్యటన లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, కోరుకొండ మండల తహశీల్దార్ పి. పాపారావు, ఇరిగేషన్ ఏ ఈ శివ ప్రసాద్ , ఇతర మండల అధికారులు, సర్వేయర్లు, బురుగుపూడి, కాపవరం సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News