లోపాలతో పుట్టిన పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

-రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం(RBSK) మరియు జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రంలు మెరుగైన సేవలు అందించాలి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం(RBSK) మరియు జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రంలు మెరుగైన రీతిలో నాణ్యత పెంపుదలతో సేవలు అందించే దిశలో భాగంగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, ఆంధ్ర రాష్ట్ర వైద్య శాఖ ఆధ్వర్యంలో పుట్టిన పిల్లల మొదలు 18 సం. ల బాలలకు చెందిన చిన్న పిల్లల డాక్టర్లు, గుండె సంబంధ డాక్టర్లు, ప్రత్యేక అవసరాల ఎడ్యుకేటర్స్, ఫిజియథెరపీ, పారామెడికల్, మానసిక రోగుల డాక్టర్లు, మూగ, చెవిటి, కంటి చూపు కు సంబంధించిన వివిధ ప్రత్యేక అవసరాలకు చికిత్స అందించే వైద్యులకు, డి ఈ ఐ సి మేనేజర్లకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో నేటి బుధవారం సాయంత్రం స్థానిక రుయా ఆసుపత్రి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రుయా ఆసుపత్రిలోని చిన్న పిల్లల విభాగంలో ఈ నెల 6 నుండి 10 వరకు ఏర్పాటు చేసిన ఐదు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ వైద్య మిషన్ ద్వారా ఏర్పాటుచేసిన RBSK డిఈఐసి శిక్షణ కార్యక్రమం లో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివిధ స్పెషాలిటీలకు చెందిన డాక్టర్లు ఈ శిక్షణను ఎంతో శ్రద్ధతో మనసుపెట్టి మాస్టర్ ట్రైనర్లు చెప్పిన విలువైన అంశాలను తెలుసుకొని బాలల ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకొనుటలో ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. శిక్షణలో పాల్గొనేటప్పుడు సర్వీసు ఎక్కువ ఉంది అని, అన్ని తెలుసు అనీ అనుకోకుండా మెంటర్ లు చెప్పిన అంశాలను శ్రద్ధగా విని నేర్చుకుని వాటిని క్షేత్ర స్థాయిలో అమలుపరచాలని కోరారు. చాలా మంది పిల్లల్లో పౌష్టికాహార లోపం గల, ఎత్తు తక్కువ బరువు తక్కువ గల పిల్లలు, రక్త హీనత, బుద్ధిమాంద్యం, ప్రవర్తన లోపాలు, పక్షవాతం, నరాల బలహీనత తదితర లోపాలతో పుట్టిన పిల్లల మొదలు 18 సంవత్సరాల బాలలలో ఏర్పడిన లోపాలను ముందుగా గుర్తించే దిశలో మెరుగ్గా వారికి సకాలంలో జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రంలో చికిత్స అందించేలా ఉండాలని, మంచి ఆరోగ్యంతో కూడిన భారత పౌరులుగా తయారయ్యేలా బాలలకు మంచి వైద్య చికిత్స అందించాలని సూచించారు.

ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయం పొందిన పాఠశాలల్లో 1 నుండి 12 తరగతులలో చేరిన 6-18 సంవత్సరాల పిల్లలకు, పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాల వరకు పిల్లలను కవర్ చేయాలని లక్ష్యంగా, RBSK కింద పిల్లల స్క్రీనింగ్ కమ్యూనిటీ స్థాయి మరియు ఫెసిలిటీ సెంటర్ల నుండి గుర్తించిన బాలలకు మంచి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.

అనంతరం అందులోని న్యూట్రిషన్ రేహాబిలిటేషన్ సెంటర్ ను కలెక్టర్ తనిఖీ చేసి అందులోని పిల్లలకు అందుతున్న పౌష్టిక ఆహారం, వారికి అందుతున్న వైద్య సేవలపై పిల్లల తల్లులతో మాట్లాడి తెలుసుకున్నారు. వంటశాల, ఆహార నాణ్యత పరిశీలించారు. వారితో మాట్లాడుతూ 3 నుండి 4 వారాల వరకు చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి వెళ్ళిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల నుండి అందించే పాలు, గుడ్లు, చిక్కీలూ తదితర పౌష్టిక ఆహారం, ఎఎన్ ఎం వారు అందించే ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు క్రమం తప్పక వాడాలని అన్నారు.

అనంతరం జిల్లా బాలల ముందస్తు చికిత్స కేంద్రం నూతన భవనాన్ని సందర్శించి అక్కడ వివిధ ఆరోగ్య లోపాలు గల బాలలకు అందిస్తున్న వినికిడి లోపాలు, ఆప్టో లోపాలు, స్పీచ్ థెరపీ చికిత్స విధానం పరికరాల పనితీరు డాక్టర్లను అడిగి తెలుసుకుని పిల్లలకు మంచి చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ టీమ్ అడ్వైజర్ డాక్టర్ దీప్తి ఖన్నా, శ్రీనివాసులు రెడ్డి స్టేట్ నోడల్ అధికారి RBSK, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి శాంత కుమారి మాస్టర్ ట్రైనర్ డా. ప్రదీప్, డా. తారకేశ్వరి తదితర డాక్టర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *