కొవ్వూరు గోష్పాద క్షేత్రం మహాశివరాత్రి ఏర్పాట్లు

-అధికారుల మధ్య సమన్వయం పై సూచనలు చేశాము పటిష్ట ఏల్
-కొవ్వూరు ఆర్డీఓ, ఎస్. మల్లి బాబు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో ఫిబ్రవరి 18 న నిర్వహించనున్న మహాశివరాత్రి పండుగ ఏర్పాట్లు, అధికారుల మధ్య సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కొవ్వూరు ఆర్డీఓ, ఎస్. మల్లిబాబు, చైర్ పర్సన్ బావన రత్న కుమారి లు అన్నా రు.

బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో మహాశివరాత్రి ఏర్పాట్లు పై సంబంధిత శాఖల అధికారులతో మునిసిపల్ చైర్ పర్సన్ బావన రత్న కుమారి తో కలిసి సమీక్ష చేశారు. ఈ సందర్బంగా ఆర్డీఓ ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్ధం స్నాన ఘట్టముల యందు బారికేడ్లను ఏర్పాటు చేయవలసినదిగా, ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులకు స్పష్టం చేశారు. ఎటువంటి ఘటనలు జరుగకుండా ఆలయ ప్రాంగణము నందు, స్నాన ఘట్టముల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయవలసినదిగా పేర్కొన్నారు. బందోబస్త్ ఏర్పాట్లు నిర్ణీత పాయింట్ల వద్ద ఏర్పాట్లు చేయాలని డి.ఎస్పి వి.ఎస్.వి. వర్మ కి స్పష్టం చేశారు.

గోష్పాద క్షేత్ర పరిసర ప్రాంతము నందు భక్తుల కొరకు ప్రధమ చికిత్సా కేంద్రము ఏర్పాటు చేయవ లసినదిగాను, సదరు కేంద్ర మునందు నాణ్యత మైన మం దులు, ఏర్పాటు చేయాలని, వైద్య అధికారులను మార్గ నిర్దేశం చేశారు. భక్తులు స్నానములు ఆచరించుటకు అనువుగా స్నానాల రేవు యందు ఇసుక మేటలను తొలగింఛి, ఘాట్లను పరిశుభ్రముగా ఉంచవలసి నదిగా ప్రమాద నివారణ కొరకు నదిలో మెష్ లు ఏర్పాటు చేసి, బోట్లను ఏర్పాటు చేయవలసినదిగా మునిసిపల్ అధికారులకు గజ ఈతగాళ్ల ను ఏర్పాటు చేయవలసినదిగాను, స్నాన ఘట్టముల యందు బోట్లను, గజ ఈతగాళ్లను సిద్ధము గా ఉంచాలని ఫైర్, మత్స్య శాఖ అధికారులకు ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు.

ఈ సందర్బంగా మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్న కుమారి మాట్లాడుతూ గోష్పాదక్షేత్ర ము నందు ఆలయ ప్రాంగణం లో, ఆలయము బయట శుభ్ర ముగా వుండే విధంగా చూచుటకు, స్నానాల రేవుల నందు శానిటేషన్ చేయుటకు, ఆలయ ప్రాంగణంలో, ముఖ ద్వారం నందు లైటింగ్, త్రాగునీటి సదుపాయము ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మరుగుదొడ్లు ఏర్పాటు, పరిశుభ్రంగా ఉంచుటకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ విషయం పై ఆదేశాలు జారీ చేశామన్నారు. మహాశివరాత్రి రోజున ఏర్పాటు చేయబోవు పూజా సామాగ్రి, ఇతర దుకాణములను ముఖద్వారము వద్ద పెట్టకుండా, భక్తుల రాకపోక లకు ఇబ్బంది కలుగని ప్రదేశాలలో ఒక పద్ధతిలో ఏర్పాటు చేసే విధముగా చర్యలు తీసు కొనవలసినదిగా మునిసిపల్ కమీషనర్ బి. శ్రీకాంత్ ఆదేశించారు. గోష్పాద క్షేత్రము జిల్లా లోనే అంత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశము కావున క్షేత్ర పవిత్రత ను కాపాడుచూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసినదిగాను భక్తులకు ఎటువంటీ ఇబ్బందులు కలుగకుండా జల్లు స్నానములకు ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమం లో మండల తాహిసీల్దార్ బి. నాగరాజు నాయక్, ఏ. డి. ఈ, పి. అచ్యు తాచారి, ఏ ఈ, ఎ. జి. ఆర్. బి., ఆర్. సునీల్ బాబు, తదితరు లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *