కృష్ణా జలాలను ప్రతీ ఇంటికి అందిస్తాం

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30వ డివిజన్లో రూ. 7.45 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల అవసరాల దృష్ట్యా కృష్ణా జలాలను ప్రతిఒక్క ఇంటికి అందజేస్తామని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 30వ డివిజన్లోని గద్దె వెంకట్రామయ్య నగర్లో రూ.7.45 కోట్ల వ్యయంతో 1,500KL రిజర్వాయర్ నిర్మాణం, పంపింగ్ మెయిన్ పైపులైన్ పనులకు స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. గత తెలుగుదేశం పాలకులు ప్రజలను మోసగించడానికి శిలాఫలకాలు వేయడం తప్ప పనులలో చిత్తశుద్ధి చూపలేదని మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపడం జరుగుతోందన్నారు. ప్రజల సౌకర్యార్థం రామకృష్ణాపురం నుంచి దేవీనగర్ వరకు ప్రధాన రహదారిని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. దావుబుచ్చయ్య కాలనీలో ప్రధాన రహదారి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. దాదాపు 30 వేల మంది జనాభాకు త్రాగునీరు అందించేందుకు చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే గుణదలలోనూ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి త్వరలోనే భూమిపూజ నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సీఈ(ఇంజనీరింగ్) ప్రభాకర్, ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, నాయకులు గోపుశెట్టి శ్రీను, తుంపాల వరప్రసాద్, మార్తి చంద్రమౌళి, సామంతకూరి దుర్గారావు, డి.దుర్గారావు, డప్పుకొట్టు కృష్ణ, సుబ్బారెడ్డి, రమేష్, పవన్ రెడ్డి, అక్బర్, లక్ష్మీ, అమ్మాజీ, వీఎంసీ సిబ్బంది, కాలనీవాసులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *