పౌర సేవలు అందించే సామర్థ్యం నూరు శాతం ప్రగతి లక్ష్యంగా అడుగులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలు, పౌర సేవలు అందించే సామర్థ్యం నూరు శాతం ప్రగతి లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం వెలపూడిలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి  స్త్రీ శిశు సంక్షేమ దిశగా స్థిరమైన అభివృద్ధి వృద్ధి, సచివాలయ పౌర సేవలు, పంచాయతీ రాజ్ ద్వారా స్థిరమైన అభివృద్ధి, పాఠశాల విద్య పై నిర్వహించిన విసి కి స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లా వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాలు 337 కి గాను 175 పూర్తి చేసినట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ పరిధిలో  33 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. ఎఫ్ ఆర్ ఎస్ యాప్ 1247 మంది వైద్య అనుబంధ అధికారులు, సిబ్బందిలో 1239 మంది రిజిస్ట్రేషన్ చెయ్యడం జరిగిందన్నారు.   ఫ్యామిలీ డాక్టర్ ద్వారా జనవరిలో 15250 మందికి, ఫిబ్రవరి నెలలో 8 వ తేదీ వరకు  5679 మందికి వైద్య సేవలు అందించారన్నారు.

మాతా శిశు సంక్షేమ, పౌష్టికాహరం అందచేసే ప్రక్రియ పై మరింత దృష్టి సారించడం జరుగుతున్నట్లు కలెక్టర్ మాధవీలత అన్నారు.  జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న మూడు పి హెచ్ సి లు పురోగతి లో ఉన్నాయన్నారు. అన్ని పి.హెచ్.సి ల పరిధిలో చేపట్ట వలసి ఉన్న మరమ్మత్తులు త్వరిత గతిన పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఆసుపత్రుల్లో చేపడుతున్న వైద్య సేవలు తదితర అంశాలపై ఏ ఎన్ ఎం ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సి ఎస్ ఆదేశించారు. ఖాళీగా ఉన్న అగన్వవాడి, ఆశా వర్కర్స్ పోస్టుల భర్తీ చేసే విధానం లో 22 అగన్వవాడి, 63 ఆశా వర్కర్స్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఇంకా  అగన్వవాడి 14 , ఆశా వర్కర్స్ 13 భర్తీ చెయ్య వలసి ఉందని కలెక్టర్ మాధవీలత అన్నారు.

జిల్లాలో 8312 మంది గర్భ వతులు నమోదు అయ్యారని వారిలో రక్తహీనత తేలికపాటి లక్షణాలు ఉన్న వారు 1478, మోస్తారు లక్షణాలు ఉన్న వారు 232 మంది ఉన్నట్లు తెలిపారు. వారికి అవసరమైన పౌష్టికాహారం, ఐరెన్ టాబ్లెట్స్ అందిస్తున్నట్లు మాధవీలత తెలిపారు. జిల్లాలో 2679 మంది బరువు తక్కువ ఉన్న వారికి ప్రత్యేక వై ఎస్ ఆర్ సంపూర్ణ ఆహార పథకం కిట్స్ అందిస్తున్నట్లు తెలిపారు. బలహీనత కలిగిన పిల్లల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సచివాలయ వ్యవస్థ ద్వారా 3222 సమీకృత ధ్రువపత్రాలు, 2887 ఆదాయ దృవపత్రలను అర్హత కలిగిన మేర జారీ చేశామని తెలిపారు.

జిల్లాలో  గుర్తించిన 36 స్కూల్స్ హాస్టల్స్ పరిధిలో ఉన్న 736 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.  పిల్లలు పట్ల, వారిలో నైపుణ్యం కలిగే దిశలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల బాధ్యత తో మెలగాలని క్షేత్ర స్థాయి పర్యటనా సందర్భంలో తెలియ చేస్తున్నట్లు అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డిఎంహెచ్ఓ ,
డా. కె.వెంకటేశ్వరావు పిడి, ఐసిడిఎస్,కె. విజయకుమారి డీఈవో, ఎస్.అబ్రహం, డి.సి. హెచ్. ఎస్. డా. ఎమ్. సనత్ కుమారి, జిల్లా ట్రైబల్ అధికారి కె. ఎన్. జ్యోతి, సి. పి. ఓ, కె. ప్రకాశరావు, డి. వి. ఈ. ఓ, జె. వి.ఎస్. ఎస్. సుభ్రహ్మ ణ్యం, డిప్యూటీ డి. ఎం.అండ్. హెచ్. ఓ డా. ఎన్.వసుంధర తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *