-తూర్పు గోదావరి జిల్లాలో 21 వేలకు పైగా కేసులు పరిష్కారం (రాత్రి 7 వరకు)
-ప్రధాన జిల్లా జడ్జి (ఎఫ్ ఏ సి) కె.సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సివిల్ తగాదాలు, రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని జిల్లా జడ్జి (ఎఫ్ ఏ సి) కె. సునీత అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి కె. సునీత మాట్లాడుతూ, కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో జాతీయ లోక్ అదాలత్ జరిగే రోజున పరిష్కారం కోసం వొచ్చిన చివరి కేసు పరిష్కారం చూపే వరకు ఎంత సేపైనా వేచి చూసి సమన్యాయం కోసం న్యాయ మూర్తులు, న్యాయ వాదులు, ప్రతీ ఒక్కరూ పని చేస్తామన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం ద్వారా సత్వర న్యాయం జరిగేలా న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయని పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా జడ్జి కె. సునీత అన్నారు. ప్రజల్లో, కక్షి దారుల్లో లోక్ అదాలత్ లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం కోసం సామాజిక బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించే లోక్ అదాలత్ సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే కాకుండా లోక్ అదాలత్ బెంచ్ కు వొచ్చిన కేసులకు పరిష్కారం చూపి తీర్పు వెల్లడించడం జరుగుతుందని పేర్కొన్నారు. కానీ అందరికి, జాతీయ లోక్ అదాలత్ జరిగే రోజున ఎంత ఆలస్యం అయినా జవాబుదారీతనంతో కేసుల పరిష్కారం చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు , ఇతర సంస్థలు వారితో క్షుణ్ణంగా నెల రోజులుగా వారి పరిధిలో క్లైమ్స్ పరిశీలన చేసి చక్కటి పరిష్కారం చూపడం జరుగుందన్నారు. కేసులు పరిష్కారం కోసం అవసరమైన డాక్టర్ ధృవ పత్రాలు జారీకై వైద్య అధికారులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన విధానంలో కేసులు పరిష్కారం కోసం తూర్పు గోదావరి జిల్లాలో 4 నూతన జిల్లాల (కాకినాడ, బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా) పరిధిలో 43 బెంచ్ లలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించామని పేర్కొన్నారు. ఫాక్సో, మర్డర్ వంటి కేసులు తప్ప, రాజీ ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న కేసులకు పరిష్కారం చూపుతామని, రాజీ పడదగిన వాటికి అవార్డ్ జారీ చేస్తే ఆ తీర్పు లకు తిరుగు ఉండదన్నారు. ఉదాహరణ చెక్కు బౌన్స్ కేసులో జైలు శిక్ష, జరిమానా, పరిహారం పై జాతీయ లోక్ అధాలత్ అవార్డ్ జారీ చేయ్యావచ్చునని అన్నారు. పైన పేర్కొన్న వాటిని ఈ కోర్టు ద్వారా విచారణ ,అప్పీల్ లో ఉన్న కేసు లకు సంబంధించిన రాజీ పడితే, యదార్థం లోకి వెళ్ళ గలిగితే అన్ని తగాదాలకు పరిష్కారం సాధ్యం అవుతుందన్నారు.
జిల్లాలో కేసులు పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ కంపెనీ లు, పోలీస్, ప్రభుత్వ రంగ సంస్థల, బ్యాంకుల సహకారంతో జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ ను చక్కగా నిర్వహించడం సాధ్యం అయిందని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని 15 కోర్టు లలో ఏర్పాటు చేసిన 43 బెంచ్ ల ద్వారా సుమారు 21 వేలకు పైగా కేసులు (రాత్రి 7.15 వరకు) జాతీయ లోక్ అధాలత్ లో పరిష్కారం చేశారు.
పరిష్కారం అయినవాటిలో ఇరుపక్షాలు రాజీ చేసుకోవడం ద్వారా :
వాహన ప్రమాదం ఘటన లో చెందిన వ్యక్తులు మృతి చెందిన ఘటన లో ముచ్చకర్ల పద్మ (499/19) వారి కుటుంబ సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బెంచ్ వారి వద్ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పరస్పర అంగీకారంతో రాజీకి రావడం తో రూ.9.50 లక్షల కు పరిహారం నిర్ధారిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.
వాహన ప్రమాద ఘటనకు సంబంధించి బొబ్బరి పద్మ (452/22) వారి కుటుంబ సభ్యులకు 8 వ అదనపు జిల్లా జడ్జి బెంచ్ ఆధ్వర్యంలో రు.14.35లక్షల పరిహారం తో ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇరు పార్టీలు రాజీ కుదుర్చుకున్నారు.
ఎస్సీ ఎస్టీ కోర్టు జెడ్జి ఎం. నాగేశ్వరరావు, సీనియర్ జిల్లా జడ్జి & డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి కె.ప్రత్యూష కుమారి, డిఎల్ఎస్ఎ సెక్రటరీ , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐ.శివప్రసాద్, న్యాయవాదులు జీ. కృష్ణ కపూర్, టి. గారహి, రవాణా శాఖ అధికారులు, డాక్టర్లు, ఇన్సూరెన్స్, టెలికాం కంపెనీ ప్రతినిధులు, కక్షి దారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News