రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డా॥ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల ఆసుపత్రికి చెందిన వైద్య బృందం కారాగారములోని ఖైదీలకు శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు జైల్ పర్యవేక్షకులు ఎస్. రాజా రావు తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రుగ్మతలతో బాధపడుచున్న వ్యాధిగ్రస్తులకు హోమియో వైద్యచికిత్సను అందించినారు. సుమారుగా 200 మంది పైగా ముద్దాయిలకు వారియొక్క అనారోగ్య సమస్యలను బట్టి వారికి ఉచితముగా ఔషధములను కూడా అందించినారు. అటులనే వయసు పైబడిన వృద్ధులకు, దీర్ఘకాల రుగ్మతలయిన రక్తపోటు, మధుమేహ సంబంధ వ్యాధులతో బాధపడువారికి కూడా ప్రత్యేక హోమియో మందులను ఛీప్ మెడికల్ ఆఫీసర్ డా|| పి.వి. హరినాథ్ , మెడికల్ ఆఫీసర్లు డా॥ జ్యోతి డా|| కె. శ్రీనివాసు వారి ఆధ్వర్యంలో ఇంటర్న షిప్ పొందుతున్న వైద్య విద్యార్థులతో కలిసి అందజేసినారు. ఈ కార్యాక్రమానికి కేంద్రకారాగార పర్యవేక్షణాధికారి యస్. రాజారావు అధ్యక్షత వహించినారు. ప్రస్తుత కాలములో అల్లోపతి వైద్యం కంటే హోమియో వైద్యం ద్వారా ఎటువంటి ఇతర దుష్పరిణామాలు ఉండవని, హోమియో ఔషధముల వాడకం వలన వ్యాధి ని మూలాల నుంచి నయం చేయవచ్చని తెలిపినారు. ఈ కార్యక్రమునకు ఉప పర్యవేక్షణాధికారులు యం. రాజకుమార్, యస్. కమలాకర్, కారాగార వైద్యాధికారిణి డా|| పి.కోమల, జైలర్ కె.దుర్గా రమేష్ , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News