జిల్లాలో సాగులో ఉన్న ప్రతి ఒక్క ఎకరా ఈ కేవైసి తప్పనిసరి

-మార్చి 4 వ తేదీ శనివారం ఈ కేవైసి అనుసంధానం కి చివరి తేదీ
-ఇప్పటి వరకు 97.31 శాతం ఈకెవైసీ ప్రమాణీకరణ పూర్తి
-వెనుకంజలో ఉన్న బిక్కవోలు, అనపర్తి
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రయోజనం రైతులకు అందచెయ్యడం లో ఈ కేవైసి అనుసంధానం కీలకం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం మండల వారీగా ఈ కేవైసి ప్రగతిపై వ్యవసాయ, అనుబంధ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, అనపర్తి 86 శాతం, బిక్కవోలు 90 శాతం మాత్రమే లక్ష్యం చేసినందున, మిగతా మండలాలు 95 – 99 శాతం పైగా చేసినా, ఆ డేటా జిల్లా ప్రగతిపై ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో సాగు భూమి విస్తీర్ణత 1,84,114 ఎకరాలు ఈ క్రాప్ ద్వారా గుర్తుంచగా క్షేత్ర స్థాయి లో గ్రామ వ్యవసాయ సహాయకులు 1,83,878 (99.87%) ఎకరాలకు ప్రమాణీకరణ (అధంటిఫికేషన్) చేయడం జరిగిందన్నారు. మార్చి 4 వ తేదీ శనివారం తో ఈ కేవైసి ప్రక్రియ పూర్తి చెయ్యవలసి ఉందన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులు గుర్తించిన సాగు విస్తీర్ణం ధృవీకరించిన తదుపరి వి ఆర్ వో లాగిన్ కి రావడం జరుగుతుందన్నారు. ఆమేరకు దృవీకరణ చేసి, రైతు వారీగా ఈ కేవైసి పూర్తి చేయాల్సి ఉందన్నారు. అనపర్తి మండలం లో 9303 ఎకరాలకు గాను 8034 ఎకరాలు (86.56%), బిక్కవోలు లో 14,230 ఎకరాలకు 12,739 ఎకరాలు (90.05%) ఈ కేవైసి చేశారని అన్నారు. గ్రామం వారీగా పెండింగ్ డేటా ఎంట్రీ యుద్ద ప్రాతిపదికన చేపట్టి శుక్రవారం సాయంత్రం 5 గంటలలోగా వివరాలు అప్లోడ్ చెయ్యలని స్పష్టం చేశారు. శనివారం లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ 100 శాతం ఈ కేవైసి పూర్తి చెయ్యాలని, 99 నుంచి నూరుశాతం ఈ కేవైసి పూర్తి చేసిన వారి నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. సీతానగరం, రాజమహేంద్రవరం రూరల్ మండలాలు వంద శాతం చెయ్యడం పై మండల సిబ్బందిని కలెక్టర్ అభినందించారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *