రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) పరిధిలో కొత్తగా కలిసిన మండలాలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలకు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ మరియు రుడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా), రాజమహేంద్రవరం వారి అధ్యక్షతన మునిసిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్ నందు రుడా పరిథిలో కొత్తగా కలిసిన జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలతో సమావేశన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డెలిగేషన్ అఫ్ పవర్స్ జి.ఒ ఎమ్.ఎస్.నెం. 443, ఎమ్.ఎ. & యు.డి. తేది. 18-12-2017 ప్రకారం డెలిగేషన్ అఫ్ పవర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనుమతి నిర్వహణ వ్యవస్థ(APDPMS) , పంచాయతీ రాజ్ సమాచార వ్యవస్థ (PRIS) సాఫ్ట్ వేర్ గురించి రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) పరిధిలో కొత్తగా కలిసిన మండలాలు గల జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్లు, మరియు పంచాయతీ సెక్రెటరీలకు అవగాహన కల్పించినారు. ఆన్లైన్ సిస్టమ్ నందు పంచాయతీల పరిధిలో ఉండే 300 చ.మీ.లకు లోబడి భవన నిర్మాణాలు, లేవుట్లు మరియు ఇండస్ట్రీస్ అప్లికేషన్స్ ఏ విధంగా అప్ లోడ్ చెయ్యాలో తెలియపరిచినారు. ఇంకనూ రుడా పరిధిలో వున్న కొన్ని గ్రామ పంచాయతీలకు పి ఆర్ ఐ ఎస్ యాప్ వినియోగములోనికి తేలేదన్నారు. వారు వెంటనే వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ లన్నియు అన్ని విధములైన రిజిష్టర్లు నిర్వహించాలని, అనగా బిల్డింగ్, లేవుట్ , అనధికార బిల్డింగ్, అనధికార లేవుట్ ల రిజిష్టర్లు నిర్వహణ చేయవలిసినదిగా ఆదేశించినారు. రూడా పరిధి లోనికి వచ్చే పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలు, అక్రమ లేవుట్లు చేపట్టే వారిపై ఆయా పంచాయతీ సెక్రటరీలు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదేశాలు అమలు చేయని యెడల సదరు పంచాయతీ సెక్రెటరీలపై శాఖ పరంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశము నందు జిల్లా పంచాయతీ ఆఫీసర్ పి. జగదాంబ, రుడా సెక్రటరీ జి. శైలజావల్లి, రుడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాస్, రుడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. శ్రావణ్ కుమార్, రుడా అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, ఎమ్ అనిత, రుడా జె. పి. ఒ. – కె. రాజ కుమారి , రుడా పరిధిలో గల జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, డివిజనల్ స్థాయి పంచాయతీ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News