-19 సంవత్సరాల లోపు పిల్లలు తప్పక నులిపురుగు నివారణ మందు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి..
-ఉపాధ్యాయులు, వైద్య బృందం విద్యార్థులను సమీకరించాలి.
-కలెక్టరు డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నులిపురుగుల నివారణ (డి వార్మింగ్ డే) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు డా. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 14 , 18 తేదీల్లో నిర్వహించే నులిపురుగుల నివారణ (డి వార్మింగ్ డే) కార్యక్రమంపై వైద్యాధికారులు, అనుబపంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ నులిపురుగు నివారణకు వైద్యాధికారులు, సిబ్బంది కి ప్రజలు, పాఠశాల విద్యార్థులు సహకరించాలన్నారు. ఉపాధ్యాయలు నులిపురుగుల నివారణ దినోత్సవం ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. డివార్మింగ్ మెడిషన్ పంపిణీలో ఎంఈవో, ఎంఆర్పీ ముందుగానే పాఠశాలల విద్యార్థుల జాబితాలను సిద్దం చేసి నూరు శాతం హజరయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వైద్యాధికారులు కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. ఏదైనా ప్రతికూల ప్రతిచర్యలు ఏర్పడినట్లయితే వెంటనే జిల్లావైద్య ఆరోగ్య అధికారి, డీసీ ఆర్బిఎస్ కే లకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా నులిపురుగులు నివారణ (డివార్మింగ్ డే) గోడ ప్రతిని కలెక్టరు మాధవీలత వైద్యాధికారులు,ఇతర అధికారులతో కలసి ప్రారంభించారు.
బేటి బచావో బేటి పడావో కార్యక్రమములో భాగంగా ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఇన్స్టిట్యూషన్, యుపిహెచ్ఈ నందు లైంగిక వేధింపులకు గురైన వారిపై చర్యలు తీసుకునే విధంగా ఆరుగురు సభ్యులతో కూడిన అంతర్గత ఫిర్యాదుల సెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీలో డిఎల్ఏటీవో డా.ఎన్. వసుంధర, డిఐఓ ఇన్చార్చి డా.జీ వరలక్ష్మి, డిఎన్.ఎంఓ డా. పి లక్ష్మీదేవి, పీఎంవో పి. వీర లక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ ఎ. రజియా అహ్మద్, జూనియర్ అసిస్టెంట్ ఎం మంజూ రెడ్డిలతో బృంద సభ్యులుగా ఉంటారన్నారు. ఫిర్యాదులు స్వీకరకణ అనంతరం కమిటీ స్పందించి తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డియంహెచ్ఓ డా. కె. వెంకటేశ్వరరావు, డిఎల్ఏటీవో డా.వసుంధర, డీసీహెచ్ఓ డా. ఎస్. సనత్ కుమారి, జిల్లా కోఆర్టినేటర్ డీఎస్ఓ డా.టి. రాజీవ్, జిల్లా కోఆర్డినేటర్ డి.సుబ్బారావు, ఎపిడిమాలజిస్ట్ సుధీర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎస్.సుధాకర్ ఎంహెచ్ఓ డా. వినూత్, డీఈవో ఎస్.అబ్రహం, గిరిజన సంక్షేమాధికారి, జ్యోతి, డిఎల్డీవో వీణాదేవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News