ఇంజినీరింగ్ అధికారులు సునిశితంగా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో నూతనంగా రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్నాయని, పనుల్లో జాప్యం, నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా ఇంజినీరింగ్ అధికారులు సునిశితంగా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ విద్యా నగర్ లో రూ.60 లక్షలతో నిర్మాణం చేసిన సిసి రోడ్, డ్రైన్, రూ.10లక్షలతో చేపట్టిన కొరెటేపాడు మెయిన్ రోడ్ డివైడర్ మరమత్తులు, పండరి పురంలోరూ.45 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్ పనులను, రూ.1.80 కోట్ల ఎన్.క్యాప్ నిధులతో విస్తరణ, డ్రైన్ టు డ్రైన్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నజెకెసి కాలేజి రోడ్ తదితర ప్రాంతాల్లో పరిశీలించి, రోడ్ల, డ్రైన్ల నాణ్యత, కొలతలను తనిఖీ చేసి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో ప్రతి వార్డ్ లో సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉండి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న పలు రోడ్లను, మెరుగైన ప్రజారోగ్యం కోసం సిసి డ్రైన్ల నిర్మాణంకు అధిక ప్రాధ్యాన్యత ఇస్తున్నామన్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, పనుల వేగవంతంకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనుల వేగంతోపాటు నాణ్యతా ప్రమాణాలు నూటికి నూరు శాతం పాటించేలా ఎమినిటి కార్యదర్శులు, ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సిసి రోడ్, డ్రైన్ల నాణ్యత, కొలతలు పరిశీలించి పనుల వివిధ స్టేజిలను యం.బుక్ లో రికార్టు చేయాలని ఎమినిటి కార్యదర్శులను, అన్నిదశలలోను జరిగే పనులను ఫోటోలతో ఫైలు మెయింటైన్ చేయాలని క్వాలిటి కంట్రోల్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా లోపాలు గుర్తిస్తే కాంట్రాక్టర్ తో పాటు ఇంజినీరింగ్ అధికారులు, ఎమినిటి కార్యదర్శుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. టెండర్ పొంది అగ్రిమెంట్ ప్రకారం పనులు పక్కాగా జరగాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని, రఫ్ ఎం.బుక్ ని ఎమినిటి కార్యదర్షులే సిద్దం చేయాలని ఆదేశించారు. సచివాలయాల వారిగా పనులను ఏమినిటీ సెక్రటరీలు ఎప్పటికప్పుటు పర్యవేక్షిస్తూ ఇంజినీరింగ్ అధికారులకు పనుల పురోగతిపై వివరాలు అందించాలన్నారు. జెకెసి కాలేజి రోడ్ ను 15 మీటర్ల వెడల్పుకు విస్తరించడానికి చర్యలు తీసుకోవాలని, విస్తరణకు అడ్డుగా ఉన్న ఆక్రమణల తొలగింపు చేసి, డ్రైన్ టు డ్రైన్ బిటి రోడ్ వేయడానికి చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు.
అనంతరం సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ ప్రతి కార్యదర్శి ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు విధి విదానాలు, నిబందనలు పాటించాలని, కార్యాలయ సమయాల్లో ఫీల్డ్ వర్క్ కోసం వెళ్ళాల్సి వస్తే తప్పనిసరిగా పూర్తి వివరాలతో మూవ్మెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. సచివాలయం పరిధిలో పన్ను వసూళ్లు అడ్మిన్, త్రాగునీటి సరఫరా, అభివృద్ధి పనులు ఏమినిటి, పారిశుధ్యం, ట్రేడ్ లైసెన్సులు శానిటేషన్, భవన నిర్మాణ అనుమతులు, ఆక్రమణలు లేకుండా ప్లానింగ్ కార్యదర్శుల ప్రాధమిక విధులు అని అన్నారు. సచివాలయం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్యదర్శులు టీం వర్క్ తో విధులు నిర్వహించాలన్నారు. కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ప్రభుత్వ విధి విదానాల మేరకు పని తీరు లేకున్నా కఠిన చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు.
పర్యటనలో ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ. సుందర్రామి రెడ్డి, డి.ఈ.ఈ. మహ్మద్ రఫిక్, ఏసిపి అజయ్ కుమార్, టి.పిఎస్. గోవర్ధన్, ఎడిహేచ్ రామారావు, ఏ.ఈ.లు సూరిబాబు, సునీల్ కుమార్, అనూష, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *