-ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ అధ్యక్షుడు
రాజమహేంద్రవరం / వాడపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం తెలియచేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామిని జిల్లా కలెక్టర్ మాధవీలత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆలయ కమిటీ, అర్చకులు కలెక్టర్ దంపతులకు స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పూజారులు సమక్షంలో అర్చన చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగిందన్నారు.
Prajavartha Online Telugu News