10వ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

-జిల్లా కలెక్టర్ డా.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అమరావతి నుంచి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎస్.ఎస్. సి, ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వాహణా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టరు మాధవీలత అనుబంద శాఖల అధికారులతో కలసి హాజరయ్యారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ కె. మాధవీలత అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలు -2023 ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు నిర్వహించనున్నారని, పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 126 పరీక్ష కేంద్రాల్లో 26,129 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. అందులో బి క్యాటగిరిలో 98 కేంద్రాలు, సి క్యాటగిరిలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయన్నారు. ఇందులో ఎస్ ఎస్ సీ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్ధులు బాలురు 11477 మంది, బాలికలు 11255 మంది మొత్తం 22732 మంది, ప్రయివేట్ విద్యార్థులు బాలురు 2041 మంది, బాలికలు 1356 మొత్తం 3397 మంది కాగా వెరసి మొత్తం 26,126 మంది పరీక్షలు వ్రాసేందుకు హాజరు కానున్నారని తెలిపారు. అలాగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ఏప్రిల్ 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయన్నారు. ఇందులో ఓపెన్ స్కూల్ ఎస్ఎస్ సి పరీక్షల కోసం జిల్లాలో 99 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. ఆయా పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.

జిల్లాలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు 37288 మంది విద్యార్థులు 47 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.ఇందులో కొవ్వూరు డివిజన్ లో 10,374 మంది, రాజమహేంద్రవరం డివిజన్ లో 26931 మంది విద్యార్థులు హజరు కానున్నారన్నారు.

10వ తరగతి (ఎస్ఎస్ సి పబ్లిక్ పరీక్షలు -2023) ఇంటర్మీడియట్ పరీక్షలను ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా నిర్వహించాలని, కొత్త జిల్లాలో జరుగుతున్న మొదటి పరీక్షలను విజయవంతం చేసేందుకు అధికారులంతా నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్ష హాల్లోకి ఏ విధమైన సెల్ ఫోన్ లు తీసుకురాకుండా చూడాలని, సిబ్బంది కూడా ఎవరు సెల్ ఫోన్ తీసుకురాకుండా చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సమయానికి ఉదయం, మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు నడపాలని, ఎండలు ఎక్కువగా ఉంటాయని, తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు విద్యుత్ నిరంతరం సరఫరా చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలని, 108 వాహనం అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. పరీక్ష జరిగే రోజుల్లో కేంద్రాల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షలను తనిఖీ చేయాలన్నారు. విజయవంతంగా పరీక్షలు నిర్వహించేలా అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు.

ఈ సమావేశంలో అడిషినల్ ఎస్పీ ఎం.రజనీ , ఆర్ ఐ ఓ … ఏఎల్ ఎన్ నరశింహరావు, ఆర్జేడీ ఐ. శారద, ఏవిఎస్ సుబ్రహ్మణ్యం, డిఈఓ ఎస్. అబ్రహం, డి.వి.ఈ ఓ, జె. వి. ఎస్. ఎస్. సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *