అభినందన సభ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డ్ నందు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గా నియమితులైన సందర్భంగా తూర్పు నియోజకవర్గానికి చెందిన sk.సుభాని ఏర్పాటు చేసిన అభినందన సభలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని సుభాని మరియు డైరెక్టర్లు గా నియమితులైన 19వ డివిజన్ కు చెందిన అబిద్, 2వ డివిజన్ కు చెందిన మెయిన్ లకి శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మైనార్టీల అభివృద్ధి కి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పళ్లెం రవి, విజయలక్షి మైనార్టీ నాయకులు బాషా, కాజా, రఫీట్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *